అన్ని భాషల్లోనూ ప్రతిభ గల నటిగా పేరుతెచ్చుకుందినిత్యా మీనన్. ఓటీటీలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది తాజాగా రెండు పాటలను రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా, సినిమా కథ కూడా రాసిందట.“ నేను ఇటీవల రెండు పాటలను రికార్డ్ చేశాను. సినీ జీవితంలో నాకు తెలిసిన మరో ముఖ్యమైన అంశం సంగీతం. మంచి రొమాంటిక్ మెలోడీ, అలాగే లండన్‌కు చెందిన ఆర్టిస్ట్‌తో కలిసి ఓ క్లాసికల్ సాంగ్ రికార్డ్ చేశాను. అలాగే స్క్రిప్టు వర్కు కూడా కొంత చేశాను. స్క్రిప్టు రాయడాన్ని నేను చాలా ఇష్టపడతాను. కొన్ని నెలల్లో ఆ వర్కు పూర్తవుతుందని తెలిపింది. అలాగే
బ్రీత్వెబ్సిరీస్ గురించి స్పందిస్తూ.. తన కెరీర్‌లోని అద్భుత పెర్ఫార్మెన్సులలో ఇది ఒకట”ని చెప్పింది.. అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ నటించిన వెబ్ సిరీస్
బ్రీత్: ఇన్ టు ద షాడోస్. ఈ వెబ్ సిరీస్ లో నిత్య లెస్బియన్‌గా నటించింది. సినిమాల్లో సంప్రదాయ పాత్రల్లో నటించే నిత్య ఈ వెబ్ సిరీస్ లో లెస్బియన్‌గా నటించడంపై పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో మరో నటితో నిత్య లిప్ లాక్ కూడా చేయడం చర్చనీయాంశమైంది. అన్ని భాషల్లో నిత్యా మీనన్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే
బ్రీత్: ఇన్ టు ద షాడోస్`లో లెస్బియన్‌గా నటించడంతో ..మరో నటితో లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎంతైనా నిత్య రూటే సపరేటు. ఏమంటారు?