‘నిండు చందమామ’ నుంచి ‘నిలవనీ ఈ క్షణం..’ పాట విడుదల

ninduchandamama movie nunchi nilavani kshanam song relese
Spread the love

గణేష్ శ్రీ వాస్తవ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నిండు చందమామ’. గణేష్ శ్రీ వాస్తవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిలవనీ ఈ క్షణం..’ పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్మాత, దర్శకుడు, హీరో గణేష్ శ్రీ వాస్తవ్ చిత్ర విశేషాలను వివరిస్తూ .. . ‘నిండు చందమామ’ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన పాట ‘నిలవనీ ఈ క్షణం..’. ఈ పాటకంటే ముందు విడుదల చేసిన ‘నింగిలో ఉన్నదే నిండుచందమామ’, ‘నీ ప్రేమకే..’ పాటలు మంచి ఆదరణను పొందాయి. వేటికవే భిన్నంగా ఉంటూ అందర్నీ అలరించాయి. సంగీత, సాహిత్యాల మేళవింపు మా చిత్రం ‘నిండు చందమామ’ లో కనిపిస్తుంది. ఈ చిత్రంలోని పాటలను సంతోష్ బెజవాడ, చైతన్య, కిరణ్ వల్లూరి రాశారు. వారి సాహిత్యం కిరణ్ వల్లూరి సంగీత సారథ్యంలో పరవళ్లు తొక్కుతుంది. ఈ పాటలు ప్రతి ఒక్కరి నాలుకలపై నిత్యం నర్తిస్తాయి. అంత సక్కటి సాహిత్యం కుదిరింది. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించాం. నిర్మాణ విలువలు కూడా ‘నిండు చందమామ’లాగే ఉంటాయన్న గట్టినమ్మకం మాకుంది. నిర్మాత, దర్శకుడు, హీరోగా బరువైన మూడు భాధ్యతల్నీ మోసిన నేను ఎంతో సంతృప్తికరంగా ఉన్నాను. ఎందుకంటే ‘నిండు చందమామ’ చిత్రం యూనిట్ అందరి కృషితో అంత చక్కగా వచ్చింది కాబట్టి. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వర్కబుల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. మా చిత్రానికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు..
గణేష్ శ్రీ వాస్తవ్, పలక్ గంగేలి, ప్రియా శ్రీనివాస్, సతీష్ సరిపల్లి, మీసం సురేష్, కంభంపాటి కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వల్లూరి, డి.ఓ.పి : సాయితేజ కల్ల (సినిమా వాడు ఫేమ్), ఎడిటింగ్ : మయూర్ కులకర్ణి, పగిళ్ల సైదులు, పాటలు: సంతోష్ బెజవాడ, చైతన్య, కిరణ్ వల్లూరి, పబ్లిసిటీ డిజైనర్ : దేవ్ భీమిడిట్స్, కథ–నిర్మాణం- దర్శకత్వం: గణేష్ శ్రీ వాస్తవ్

Related posts

Leave a Comment