నవంబర్ 4న పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’ విడుదల

Zaid Khan, Jayathirtha, NK Productions Pan India Film Banaras To Release Grandly Worldwide On November 4th
Spread the love

కర్ణాటక శాసనసభకు నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ బనారస్‌తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ నిర్మిస్తున్న ఈ సినిమా గణేశ చతుర్థి సందర్భంగా విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.
నవంబర్ 4వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో జైద్ ఖాన్ , సోనాల్ మోంటెరో చూడముచ్చటగా ఉన్నారు. ఇదే పోస్టర్ లో పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న ఈ జంటని గమనించవచ్చు.
జైద్ ఖాన్, అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందాడు. తన సినిమా రంగ ప్రవేశానికి ముందు నటుడిగా అన్ని నైపుణ్యాలను నేర్చుకుంటాడు. బనారస్‌ని చిత్రాన్ని ఖరారు చేయడానికి ముందు జైద్ చాలా స్క్రిప్ట్‌లను విన్నాడు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచబోతుంది చిత్ర యూనిట్.
ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, అద్వైత గురుమూర్తి డీవోపీగా, కెఎం ప్రకాష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ తదితరులు
సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: జయతీర్థ
నిర్మాత: తిలకరాజ్ బల్లాల్
బ్యానర్: ఎన్ కె ప్రొడక్షన్స్
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: అద్వైత గురుమూర్తి
యాక్షన్: ఎ వుయి, డిఫరెంట్ డానీ
డైలాగ్స్: రఘు నిడువల్లి
లిరిక్స్ : డా.వి.నాగేంద్రప్రసాద్
ఎడిటర్: కె ఎం ప్రకాష్
ఆర్ట్: అరుణ్ సాగర్, శీను
కొరియోగ్రాఫర్: జయతీర్థ, ఎ హర్ష
పోస్ట్ సూపర్‌వైజర్ – రోహిత్ చిక్‌మగళూరు
కాస్ట్యూమ్: రష్మీ, పుట్టరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైబి రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: చరణ్ సువర్ణ, జాకీ గౌడ
పబ్లిసిటీ డిజైన్: అశ్విన్ రమేష్
పీఆర్వో : వంశీ-శేఖర్

Related posts

Leave a Comment