తమిళ హీరో ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి .
మదరాసు నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన సందర్భంలో కథా నేపథ్యం నడుస్తుందని కూడా వార్తలు వచ్చాయి .
ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ధనుష్ మొదటి తెలుగు సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా తాజాగా మొదలయింది . సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు. మరి ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా మొదట ఎందుకు ప్రారంభం కాలేదని చాలా మందిలో సందేహం వచ్చింది. శేఖర్ కమ్ముల కథ రెడీ చేయలేదేమోనని చాలా మంది భావించారు. కాని వాస్తవానికి హీరో ధనుష్ కి – ఆ చిత్ర నిర్మాతలకు మధ్య పారితోషికం విషయంగా ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా ముందు వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ మొదలయిందని తెలుస్తోంది.