తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో దోహా లో నిర్వహించిన బతుకమ్మ-దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా భారత రాయబారి కార్యాలయ కార్యదర్శి శ్రీమతి శ్రీ పద్మ కర్రీ గారు మరియు ఐసీబీఫ్ అధ్యక్షుడు జాయిద్ ఉస్మాన్ గారు ఐసీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ గారు ఐసీసీ సలహదారుల కమిటీ చైర్మన్ శ్రీ కె ఎస్ ప్రసాద్ గారు ఐసీబీఫ్ కమిటీ సభ్యురాలు రజినీ మూర్తి గారు తెలంగాణ ప్రజా సమితి అడ్వైజరి కమిటీ చైర్మన్ శ్రీ చెనవేణి తిరుపతి, గారు మరియు ఖతర్ లోని ఇతర తెలుగు సంఘాల నాయకులూ పాల్గొని వేడుకలను తిలకించారు. స్థానిక లయోలా స్కూల్ వేదికగా ఈ సంబరాలను తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు శ్రీ గద్దె శ్రీనివాస్ గారి అధ్యక్షతనా వేడుకలు ప్రారంభం అవగా వాక్యతలుగా శ్రీమతి చెన్న ప్రత్యుష మరియు వేణుగోపాల్ పడకంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణ ప్రజా సమితి సాంస్కృతిక విభాగం కార్యదర్శి ధర్మరాజు యాదవ్ పంచిత, ఈవెంట్ కోఆర్డినేటర్
శ్రీనివాస్ అల్లే వారిచే రూపొందించిన అనేక నృత్య ప్రదర్శనను స్థానిక మహిళలు పిల్లలు తమ తమ ప్రతిభను వేదికపై చక్కగా ప్రదర్శించి ఆహుతులందరిని అలరించారు తదనంతరం బతుకమ్మ వేడుక ప్రారంభం అవగా..ఎడారి గడ్డ పై తెలంగాణ సంస్కృతి సంప్రధాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ ప్రవాసి మహిళలు అందరూ మహా బతుకమ్మను పేర్చి ఆనందంగా ఆటలాడి శాస్త్రీయంగా గౌరమ్మను నిమజ్జనం చేశారు. మహిళలు పేర్చిన అందమైన బతుకమ్మల్లో అందరిని ఆకట్టుకున్న బతుకమ్మను న్యాయనిర్ణేతల సమక్షంలో ఎంపిక చేసి బహుమతి ప్రధానం చేయడం జరిగింది. అనంతరం జమ్మి చెట్టుకు పూజ చేసి ఒకరిని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ జమ్మి ఆకును పంచుకుని దసరా పండగను జరుపుకున్నారు. తెలంగాణ రుచికరమైన వంటలను అతిథులందరికి వడ్డించడం జరిగినది.
చివరగా తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షుడు సురేందర్ నామాల, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పొట్ట ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిధులకు, సబ్యులకు, స్పాన్సర్లకు, మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు