దివ్యాoగ ప్రేమ జంట ఒక్కటయ్యారు!

dhivyanga premajanta okkatayyaru
Spread the love

హైదరాబాద్ చంపాపేట్ అనాథ ఆశ్రమం లో ఉంటున్న సంతోష, జొమాటోలో ఉద్యోగం చేస్తున్న సిద్దిపేట్ కు చెందిన సునీల్ గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు! ఇరువురూ పోలియో బాధితులే! సంతోష నిలబడలేదు, వీల్ చైర్ కే పరిమితం! సునీల్ కొంచెం కాలు సహకరించదు! అయినా ఇద్దరిలోనూ కొండంత ఆత్మ విశ్వాసం! ఇద్దరూ ప్రేమించుకున్నారు! పెళ్ళి చేసేందుకు ఇద్దరికీ తలిదండ్రులు లేరు! బంధువులు మొహం చాటేశారు! అయినా సరే, సాంప్రదాయ బద్ధంగా పెళ్ళి చేసుకోవాలనేది వారి కల! అందుకే సమయం కోసం వేచి ఉన్నారు!
మహిళా సంఘాల ద్వారా ఆ విషయం తెలుసుకుని వారి కల ను నిజం చేశారు…ప్రముఖ సమాజ సేవకురాలు, ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత డాక్టర్ జి.అనూహ్య రెడ్డి గారు! అనూహ్య రెడ్డి దంపతులు పెద్ద మనసు తో అక్కున చేర్చుకుని సొంత బిడ్డలా కన్యాదానం చేసి ధూమ్ ధామ్ గా పెళ్ళి చేశారు! భాజా భజంత్రీలు విందు భోజనాలతో వధూవరుల ఆనందానికి హద్దులు లేవు! భారతీయం సత్యవాణి గారి ఆశీస్సులతో మియాపూర్ ధర్మపురి క్షేత్రం కల్యాణ మండపం లో సునీల్ సంతోష వివాహ వేడుకలు కనుల పండువగా జరిగాయి! ఇద్దరికీ అవసరమయిన దుస్తులు, అమ్మాయికి బంగారం, ఇంట్లోకి అవసరమైన అన్ని వస్తువులు, వంట సామాగ్రి తో సహా కానుకగా అందించి దీవించి ఆశీస్సులు అందించారు అనూహ్య రెడ్డి RK దంపతులు!
తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఇస్మాయిల్, డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ కె.భీమ్ సేన్, శ్రీ కుసుమ భోగరాజు, శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన మీడియా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పలువురు ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Related posts

Leave a Comment