సినీ లెజెండ్, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 75వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రపరిశ్రమ తరుపున ఆయనకు ఘన నివాళులు అర్పించారు.. ఛాంబర్ ప్రాంగణంలో గల దాసరి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన దాసరి గొప్పతనాన్ని ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ గారు, జనరల్ సెక్రటరీ దామోదర ప్రసాద్ గారు కొనియాడారు.. ఇంకా నిర్మాత, ఛాంబర్ సభ్యులు కూనిరెడ్డి శ్రీనివాస్, ఛాంబర్ కార్యవర్గ సభ్యుడు జె.వి.మోహన్ గౌడ్, నిర్మాతలు అళహరి, కాసుల రామకృష్ణ, , బండారు అమర్, ఎడిటర్ మేనగ శ్రీను మరియు ఛాంబర్ స్టాఫ్ పాల్గొన్నారు …
దర్శక ధీరుడు దాసరికి ఘన నివాళులు
