ఉత్తర అమెరికా సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితాలహరి జూమ్ కార్యక్రమంలో శనివారం రాత్రి ఆలేరుకు చెందిన కవి, విద్యావేత్త బండిరాజుల శంకర్ పాల్గొన్నారు. సంప్రదాయం,మానవత్వాల ప్రతిబింబంగా భారతీయ జీవన విశిష్టతను చాటిచెబుతూ తాను రచించిన మానవత్వం నా ఉనికి అన్న కవితను ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో శంకర్ చదివి వినిపించి బహుముఖ ప్రశంసలందుకున్నారు. అద్భుతమైన, ఆలోచనాత్మకమైన అనేక ఉపమానాలతో కవిత్వాన్ని మావనతా పరిమళంగా తానా అంతర్జాతీయ వేదిక ద్వారా అందించిన శంకర్‌ను తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రశంసించారు. భారతీయ జీవన విలువలను వ్యక్తీకరిస్తూ తమ కవితను తానా సమ్మేళనంలో అంతర్జాతీయ స్థాయిలో వినిపించి ఆలేరు సాహిత్య ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన శంకర్‌ను ఆలేరు, యాదాద్రి, భువనగిరి ప్రాంతాలకు చెందిన అధికారులు, కవులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, బంధుమిత్రులు, ప్రజలు అభినందించారు.
బండిరాజులను సన్మానించిన పూర్వ విద్యార్థులు
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు దార్ల భిక్షపతి, చిక్క శ్రవణ్, చింతకింది వెంకటేశ్, మైదం గోవర్ధన్, నాయిని శ్రీకాంత్, కటకం సుధాకర్ లు బండిరాజులను సన్మానించారు.