డియర్ మేఘ: ఓ ఫెల్యూర్ డ్రామా!

dear megha telugu movie review by M. D ABDUL
Spread the love

స్లో నేరేషన్.. బోరింగ్ ట్రీట్ మెంట్..

  • రేటింగ్ : 1.75 /5
  • విడుదల : 03-09- 2021
  • తారాగణం: ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల, పవిత్రాలోకేష్ తదితరులు.
  • సంగీతం: హరి గౌర
  • సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి
  • ఆర్ట్ డైరెక్టర్ : పీఎస్ వర్మ
  • నిర్మాత : అర్జున్ దాస్యన్
  • రచన, దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

ప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా దురదృష్టకరమే! ఎందుకంటే అసలే కరోనా పుణ్యమాని వెండితెర వెలుగులు మసిబారిపోయాయి. ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయోనని ఎంతగానోఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందుకు ఓ పసలేని ఫెల్యూర్ డ్రామా ముందుకొచ్చి అందరి మనసుల్ని కాకావికలం చేసి తీవ్రంగా నిరాశపరిచింది. మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ‘డియర్ మేఘ’ ఓ చెత్త సినిమాగా ప్రేక్షకులను వెక్కిరించింది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎమోషనల్ ప్రేమ కథా చిత్రమని దర్శకుడు పదేపదే చెప్పుకున్నా.. ఇందులో అంత సీన్ లేదని తేలిపోయింది. విడుద‌ల‌కు ముందే పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌తో అంద‌రి మనసుల్ని కొల్లగొట్టిన ఈ ‘డియ‌ర్ మేఘ‌’ క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన ‘దియా’కు రీమేక్‌. టైటిల్ పాత్ర‌ను మేఘా ఆకాష్ పోషించ‌గా.. అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు క‌థానాయ‌కులుగా న‌టించారు. సుశాంత్ రెడ్డి తెర‌కెక్కించారు. అయితే..‘మ‌న‌సుల్ని బ‌రువెక్కించే హృద్య‌మైన‌ ప్రేమ‌క‌థ’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన ఈ చిత్రం నిజమే.. ప్రేక్షకుల మ‌న‌సుల్ని గాయపరచిన ప్రేమ‌కథే! ఈ ‘డియర్ మేఘ’ ప్రేక్షకులను ఏ మేరకు గాయపరచిందో.. తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
సహజంగానే కాలేజీ రోజుల్లోనే అర్జున్ (అర్జున్ సోమయాజుల)తో మేఘా స్వరూప్ (మేఘా ఆకాష్) పిచ్చిప్రేమలో పడుతుంది. అలా ఆమె తన ప్రేమను వ్యక్తం చేయాలని ప్రతిరోజు తనలో తానే తీవ్రంగా బాధ పడినా అర్జున్ తో ప్రేమ గురించి చెప్పలేకపోతుంది. ఆ తర్వాత అర్జున్, మేఘ జీవితంలోకి వస్తాడు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయని, ఇద్దరి పరిస్థితి ఒకటే అని అర్థమయి వారిలో ప్రేమ తొంగి చూస్తుంది. అలా మొదలయిన ప్రేమ పెళ్లితో ఒక్కటి అయ్యేలోపు జరిగిన ఓ వింత ప్రమాదం మేఘ జీవితాన్ని ఊహించని విధంగా మలుపుతిప్పుతుంది. అలాంటి పరిస్థితుల్లో మేఘా స్వరూప్ కి తారసపడతాడు ఆది (ఆదిత్ అరుణ్). అతడి స్నేహంలో మేఘా మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. అలా ఆది-మేఘా స్వరూప్ ప్రేమలో పడతారు. అయితే.. అర్జున్ రాకతో వారి ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది? ఇంతకీ జరిగిన ఓ వింత ప్రమాదంలో అర్జున్ కి ఏమైంది ? చివరకు ఆది కథ ఎలా ముగిసింది? అనేది తెలుసుకోవాలంటే ఈ ‘డియర్ మేఘ’ను భరించక తప్పదు. ‘డియర్ మేఘ’ అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో వచ్చిన దర్శకుడు ఏ .సుశాంత్ రెడ్డి ఆదిలోనే తప్పటడుగు వేశాడనిపిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ తో కాస్త కొత్తగానే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు దర్శకుడు. ‘డియర్ మేఘ’గా ప్రధాన పాత్రలో నటించిన మేఘా ఆకాష్ తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా బాగానే ఆకట్టుకున్నా.. ఆమె నటనలో ఎక్కడో ఓ వెలితి కనిపించింది. ఈ చిత్రంలో కొత్తగా కనిపించడానికి మేఘా ఆకాష్ బాగానే తాపత్రయ పడినా లాభం లేకపోయింది. ఇలాంటి పాత్రను మేఘా ఎందుకు ఒప్పుకుందానిపిస్తుంది. తన ఈజ్ యాక్టింగ్ తో ఎప్పుడూ సరదాగా తిరిగే కుర్రాడి పాత్రలతో ఆకట్టుకునే ఆదిత్ అరుణ్ నుండి ప్రేక్షకులు ఊహించినంత పెర్ఫార్మెన్స్ రాలేదు. అతడి పాత్ర ఫ్రెష్ గా ఉంటుందనుకున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఆది పాత్రలో బాగా ఒదిగిపోతాడుకున్నఆదిత్ అరుణ్ కూడా ఇంత పేలవమైన నటనని కనబరుస్తాడా? అనిపించింది. మరో ముఖ్యమైన క్యారక్టర్ లో జీవిస్తాడనుకున్న అర్జున్ సోమయాజుల నటన కూడా అంతంత మాత్రమే అనిపించింది. ఈ ‘డియర్ మేఘ’ చిత్రంలో ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ మాత్రమే ఆకట్టుకున్నాయనిపించినా.. . లక్కీ పాత్రలో నటించిన పవిత్ర లోకేష్ తల్లి పాత్రలో ఎప్పటిలాగే చేసుకుంటూపోయారు. అయితే.. తన పెర్ఫార్మెన్స్ తో అనుకున్నంతగా మెప్పించలేక పోయింది. ఆమె నటించిన గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువే! ఇక ఇతర తారాగణం గురించి చెప్పుకోవలసింది ఏమీలేదు. సహజంగానే వాళ్ళు తమ పనికి రాని పాత్రల పరిధి మేరకు కానిచ్చేశారనిపిస్తుంది. ఈ చిత్రంలో గౌర హరి అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అవుతుందని అందరూ ఊహించారు. అలా ఊహించిన వారే ‘డియర్ మేఘ’ను చూశాక ‘తూచ్..’ అనుకున్నారు. దర్శకుడు సుశాంత్ రెడ్డి తన మనసులో అనుకున్నమంచి లవ్ కి సంబంధించిన ఓ చక్కటి ప్రేమకథను తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దర్శకుడు ఆ ప్రేమకథకు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోవడంలో పూర్తిగా విఫలమైనట్టే కనిపించింది. ఇక ప్రధానంగా చెప్పుకోవాలంటే మేఘ – అర్జున్ మధ్య సాగే సన్నివేశాలు ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయాయి. ప్రతీ ఫ్రేమ్ ని చూసినా అన్నీ స్లోగానే సాగి విసుగు పుట్టించాయి. అలాంటి విలువలేని పాత్రల మధ్య సినిమా చూసే ప్రేక్షకులు ఎంతగా ఇబ్బంది పడ్డారో దర్శకుడికేం తెలుసు? ఇంతకీవారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేకపోవడం వింతగా అనిపించింది. ఆది- మేఘ ప్రేమ ట్రాక్ బాగున్నా.. వీళ్ళిద్దరిమధ్య పనికిరాని సన్నివేశాలు మరీ ఎక్కువై సినిమా చూస్తున్న ప్రేక్షలకులకు యమబోర్ అనిపించాయి. అంతేకాదు.. స్లో నేరేషన్.. బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగిన ఈ ‘డియర్ మేఘ’ ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెట్టింది. అయితే.. తొలి సగంలో కొన్ని ముఖ్యమైన ఫ్రేమ్స్.. అలాగే బైక్ ప్రమాదం సన్నివేశం మినహా మిగతా సన్నివేశాలన్నీ ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇక ద్వితీయార్ధం గురించి చెప్పుకోవడం శుద్ధ దండగే! దర్శకుడు సుశాంత్ రెడ్డి ఈ మలిసగం ఎపిసోడ్ ని ఎమోషనల్ గా రన్ చేద్దామని ఎంతగానో ప్రయత్నం చేశాడు.. కానీ ఆ ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే కొన్ని చోట్ల దర్శకుడు సుశాంత్ రెడ్డి అనుకున్న ఆ ఎమోషన్, ఆ ఫీల్ ఏ మాత్రం కుదరలేదు. ఊహించని ఇలాంటి అవసరంలేని.. ఏ మాత్రం పనికిరాని సన్నివేశాల కారణంగా చిత్రానికి విపరీతమైన నష్టం జరిగింది. ఇక సాంకేతికత గురించి ఆలోచించక పోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ చిత్రానికైనా ‘దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అని చెబుతుంటారు కదా.. అలా చూస్తే.. ఈ ‘డియర్ మేఘ’కు మాత్రం ‘దర్శకుడే ఫెల్యూర్ ఆఫ్ ది షిప్’ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే సాంకేతికత గురించి ఆలోచించక పోవడమే బెటర్! అయితే.. సంగీత దర్శకుడు గౌర హరి అందించిన పాటలు ఫర్వాలేదు. ప్రధానంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమపాట ఒకే. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఓకే. బోర్ కొట్టించే కొన్ని సీన్సు ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానేజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే.. దర్శకుడు సుశాంత్ రెడ్డి తన దర్శకత్వంతో ఏ మాత్రం ఆకట్టుకుకోలేకపోయారు. దర్శకుడిని నమ్మి నిర్మాత అర్జున్ దాస్యన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చిత్రానికి అనుకున్నంతగా ప్లస్ కాలేకపోయాయి. మొత్తం మీద ఈ ‘డియర్ మేఘ’ చిత్రం లవర్స్ నే కాదు.. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఏ విధంగానూ ఆకట్టుకోలేపోయింది. ఇలాంటి ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌లు టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. అయితే.. ఇందులో ప్రేమ‌క‌థ‌ను కొత్త‌గా క‌థానాయిక కోణం నుంచి చూపించే ప్ర‌య‌త్నం చేశారు దర్శకుడు. మాతృక‌తో పోల్చి చూసిన‌ప్పుడు ద‌ర్శ‌కుడు ఆ క‌థ‌ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయ‌కుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించిన‌ట్లు తెలుస్తుంది. నిజానికి ఇలాంటి చక్కటి ప్రేమ‌క‌థ‌ల్ని చూపాలనుకుంటున్నప్పడు.. ధైర్యంతో ముట్టుకున్న‌ప్పుడు.. ఆ క‌థ‌లోని ఫీల్‌ను య‌థాత‌థంగా చూపించడం ఎంతో ముఖ్యం. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు సుశాంత్ రెడ్డి చాలా తప్పటడుగులు వేశాడనిపించింది. అంతేకాదు..ఆ విషయంలో పూర్తిగా త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్పాలి. రైలు ప‌ట్టాల‌పై ఆత్మ‌హ‌త్య‌కు సిద్ధ‌మ‌వుతున్న మేఘా స‌న్నివేశంతో చిత్రం ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌యినప్పటికీ… అక్క‌డి నుంచి నెమ్మ‌దిగా ఆమె క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాడు ద‌ర్శ‌కుడు. అయితే..అదే టెంపోను చివరివరకు కొనసాగించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. కాలేజీలో మేఘ చాటుమాటుగా అర్జున్ వెంట‌ప‌డటం.. దూరంగా ఉంటూనే అత‌న్ని ఆరాధిస్తుండ‌టం వంటి స‌న్నివేశాలు ఎంతో పేలవంగా అనిపించాయి. అలాంటి సన్నివేశాలు ఎంతో సాదాసీదా సాగిపోవడం చూసే ప్రేక్షకులకు విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అలాగే .. మేఘ-అర్జున్‌ల లవ్ ట్రాక్ లో ఏ మాత్రం ఫీల్ అనిపించదు. ఎప్పుడైతే ఆది.. మేఘ జీవితంలోకి వస్తాడో అప్పటి నుంచి కథనంలో వేగం పెరిగినప్పటికీ నిష్ప్రయోజనమే! స్నేహితుల మధ్య ఆకర్షణ ప్రేమగా మారడం.. ఆ ప్రేమను వ్యక్తపరుచుకోడానికి పడే తపన ప్రేమికులకు బాగా నచ్చుతుందనుకున్నాడేమో దర్శకుడు ప్చ్..! ఆది తన తల్లికి రాసిన ఉత్తరం చదివే విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధంలోనే ప్రేక్షకుడు కొంత సినిమాపై ప్రేమను ఫీలవుతాడనుకోవడం సహజమే! ఈ ‘డియర్ మేఘ’ కథను తమ భుజాలపై మోసుకెళాతారనుకున్న మేఘ-అదిత్ లు తమ నటనతో చక్కటి భావోద్వేగాలను పండించినప్పటికీ.. ఆద్యంతం ప్రేమను ఫీలయ్యే విధంగా సినిమాను ముందుకు లాక్కేళ్లలేక పోయారు…తమ పాత్రలతో ఆద్యంతం రక్తి కట్టించలేకపోయారు. ఏ వర్గ ప్రేక్షకులను తమ నటనతోమెప్పించలేకపోయారు. ఆది పాత్రలో అరుణ్ అదిత్ చలాకీ కుర్రాడిగా చక్కగా ఒదిగిపోయినప్పటికీ చిత్రాన్ని కాపాడలేకపోయాడు. ప్రేమికుడిగా తన నటన ఒకే అనిపించినా… తల్లితో వచ్చే సన్నివేశాల్లో కొంత పేలవమైన నటన ప్రదర్శించాడు. అర్జున్ సోమయాజులు తన నటన పట్ల మరింత దృష్టి పెట్టాల్సింది. మొత్తం మీద దర్శకుడు సుశాంత్ రెడ్డి తొలి అడుగు తప్పటడుగే వేసింది. మొత్తం మీద ఈ ‘డియర్ మేఘ’ చిత్రం స్లో నేరేషన్.. బోరింగ్ ట్రీట్ మెంట్.. ఓ ఫెల్యూర్ డ్రామాగానే మిగిలిపోయింది. ప్చ్.. ‘డియర్ మేఘ’!

Related posts

Leave a Comment