జెమిని ప్రొడక్షన్ యువ ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కొన్ని ఆసక్తికరమైన మరియు కంటెంట్-ఆధారిత సినిమాలను రూపొందించడానికి సమాయుక్తమైంది, అందులో భాగంగా సినీ ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను అందించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ రోజు వారి కొత్త ప్రొడక్షన్ ను ప్రకటించారు.
భవిష్యత్తు మరిన్ని వెంచర్‌లను ప్రకటించనున్నారు.
తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో బహుభాషా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ రేంజ్ లో యంగ్ హీరో చైతన్య వంశీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
జెమిని సమర్పణలో యశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గుడాల నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేమంత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జెమిని సీఈఓ పీవీఆర్ మూర్తి క్లాప్ నిచ్చారు.
ఈ చిత్రానికి రేంజ్
అనే టైటిల్ తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో వంశీ రక్తంలో తడిసి యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు. అతడి చేతిలో చైన్ సా( chain saw)ని మనం చూడొచ్చు. రేంజ్ అనే టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో పాటు ఈ సినిమా ఒక హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్ధమవుతోంది.
శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, లక్ష్మీకాంతం కనికే బి.ఎఫ్ఎ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. గౌతం రాజు ఎడిటర్. ఈ సినిమా షూటింగ్ నవంబర్ చివరి వారం నుండి ప్రారంభమవుతుంది. ఇందులో కొందరు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తారాగణం: చైతన్య వంశీ
సాంకేతిక వర్గం:
దర్శకుడు: హేమంత్
సమర్పణ: జెమిని
బ్యానర్: యశ్విత ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: గుడాల నవీన్
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
డీఓపి: లక్ష్మీకాంతం కనికే B.FA
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ మహన్‌కుడో
లైన్ ప్రొడ్యూసర్: విక్రమ్ విలాసాగరం
ఎడిటర్: గౌతమ్ రాజు
పీఆర్ఓ: వంశీ-శేఖర్