జర్నలిస్ట్ రఘు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలి -కీసర చౌరస్తాలో జర్నలిస్టుల నిరసన

Spread the love


జర్నలిస్టుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్ట్ రఘును బేషరతుగా విడుదల చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు మేడ్చల్ జిల్లా కీసర మండలం విలేకరులు డిమాండ్ చేశారు. శుక్రవారం కీసర అంబేద్కర్ చౌరస్తాలో విలేకరులు రఘు అరెస్టుకు నిరసనగా ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కు ను టిఆర్ఎస్ ప్రభుత్వం హరిస్తుందని నిజాలు నిర్భయంగా రాస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసు యంత్రాంగం కక్షసాధింపు లో భాగంగా రఘు నివాసం నుండి మఫ్టీలో కిడ్నాప్ చేసి కోర్టుకు తరలించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. జర్నలిస్టు రఘును భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గా మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గౌడ్ జర్నలిస్టులు చేస్తున్న ధర్నా కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో నిజాలు నిర్భయంగా రాయలేని దుస్థితి విలేకరులకు కలిగిందని ఎవరైనా ఎదురు మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అరెస్టు చేసిన రఘును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఆదినారాయణ, బాల్ రెడ్డి, మోహన్, గణేష్, శ్రీనివాస్, వెంకటేష్, యాదగిరి, శంకర్, పరశురాం, భాస్కర్, విష్ణు, నరసింహులు, కిసాన్మోర్చా మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షులు ఏనుగు రాజిరెడ్డి,మండల బిజెపి అధ్యక్షులు దేశం మల్లేష్, మేడ్చల్ జిల్లా రూరల్ ప్రధాన కార్యదర్శి జిల్లాల తిరుమల్ రెడ్డి, కిసాన్మోర్చా ప్రధాన కార్యదర్శి కొలిచెలిమి కృష్ణ, బోగారం ఎంపిటిసి వెంకట్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వంగేటి బాపురెడ్డి, నాయకులు రాగుల అశోక్ ముదిరాజ్, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment