అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు రక్షిత్ శెట్టి మరో విభిన్నమైన కథా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదలవుతుంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్.కె దర్శకుడు. ఈ సినిమా ప్రెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో…
హీరోయిన్ సంగీత శ్రింగేరి మాట్లాడుతూ ‘‘నేను ‘ఛార్లి 777’ చిత్రంలో యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ పాత్రలో నటించాను. మూడు నాలుగేళ్ల ముందు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. అమేజింగ్ జర్నీ. రక్షిత్ శెట్టిగారు అందరినీ ముందుండి నడిపించారు. ‘ఛార్లి 777’ సినిమాలో కుక్కతో నటించటం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్. జూన్ 10న వస్తోన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘‘ ‘ఛార్లి 777’ సినిమా నటుడిగా కష్టతరమైన చిత్రమనే చెప్పాలి. సాధారణంగా ప్రతి సినిమాలో ఛాలెంజెస్ ఉంటాయి. అయితే ఇది వరకు చేసిన సినిమాల్లో మనుషులతో కలసి చేశాను. ఈ సినిమాలో అలా కాదు.. కుక్కతో కలిసి సినిమా చేయడం అంటే అంత సులువు కాదు. ప్రమోద్ లేకుండా ఉండుంటే ఈ సినిమా చేయటం అంత సులభంగా వీలయ్యేది కాదు. డైరెక్టర్ కిరణ్ రాజ్ ప్రతి చిన్న విషయంలో ఎంతో పర్టికులర్‌గా ఉండేవాడు. ఎంతో ప్యాషన్‌తో చేశాడు కాబట్టే సినిమా అంత చక్కగా వచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ధర్మ అనే పాత్రలో నటించాను. చాలా అంతర్ముఖుడిగా కనిపించే పాత్ర. ఇంట్లోనే కాదు, ఫ్యాక్టరీలోనూ ఒంటిరిగానే ఉండటానికి ఇష్టపడుతుంటాడు. స్నేహితులు ఉండరు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఓ కుక్క రావటం మూలంగా ఎలాంటి మార్పులు జరిగిందనే ‘ఛార్లి 777’. ఈ సినిమాను 167 రోజుల పాటు చిత్రీకరించాం. ఈ సమయంలో వ్యక్తిగా నాలో ఎంత మార్పు వచ్చింది. నటుడిగా ఈ సినిమాలో భాగం కావటంపై చాలా గర్వంగా ఫీలవుతున్నాను. జూన్ 10న విడుదలవుతున్న ‘ఛార్లి 777’ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నవ్వు ముఖంతో బయటకు వస్తాడు. తెలుగులో ఈ సినిమాను అందిస్తోన్న రానాకి థాంక్స్. ఇలాంటి సినిమా వచ్చి 10-15 ఏళ్లు అవుతుంది. అలాగే రావడానికి కూడా అంతే సమయం పట్టొచ్చు. మా సినిమాపై నమ్మకంతో తెలుగు సహా అన్ని భాషల్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘పాండమిక్ సమయంలో రక్షిత్‌కి నాకు ఫోన్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ‘ఛార్లి 777’ వంటి డిఫరెంట్ సినిమా చేస్తున్నారని తెలియగానే .. ఏదో ఇళ్లల్లో చేసేస్తారని నేను అనుకున్నాను. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఎంత స్కేల్, స్పామ్లో సినిమా చేశారో అర్థమైంది. చూసిన వెంటనే కళ్లల్లో నీళ్లు వచ్చాయి. చాలా కమర్షియల్ సక్సెస్‌లు సాధించే సినిమాలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ 170 రోజులు.. కాశ్మీర్ సహా వివిధ ప్రాంతాల్లో ఛార్లిని తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఇలాంటి ‘ఛార్లి 777’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.
నటీనటులు:
రక్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్, బాబీ సింహ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: పరమ్ వహ్ స్టూడియోస్
రచన, దర్శకత్వం: కిరణ్ రాజ్.కె
నిర్మాతలు: జి.ఎస్.గుప్తా, రక్షిత్ శెట్టి
సంగీతం: నోబిన్ పాల్
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్.కశ్యప్
ప్రొడక్షన్ డిజైనర్ : ఉల్లాస్ హైదుర్
ఎడిటర్: ప్రతీక్ శెట్టి
డైలాగ్స్: కిరణ్ రాజ్.కె, రాజ్ బి.శెట్టి, అభిజీత్ మహేశ్, కె.ఎన్.విజయ్ కుమార్ (తెలుగు)
స్టంట్స్: విక్రమ్ మోర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బినాయ్ కందేల్వాల్, సుధీ డి.ఎస్
కాస్ట్యూమ్స్ : ప్రగతి రిషబ్ శెట్టి
కానినె ట్రైనర్ : ప్రమోద్ బి.సి
పి.ఆర్.ఒ: వంశీ కాక