కథక్ కళాక్షేత్ర ఆధ్వర్యం లో శనివారం త్యాగరాయ గానసభ లో సంత్ కబీర్ దాస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాయకులు గజేంద్ర గారు, శ్రీనివాస్ గారు, చిన్నారి కైవల్య చక్కగా కబీర్ భజన గీతాలు ఆలపించి అలరించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం, డాక్టర్ మహ్మద్ రఫీ, లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, శ్రీ కళా జనార్ధనమూర్తి పాల్గొని గాయకులను సత్కరించారు. కబీర్ దాస్ తత్వాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ నాట్య గురు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు శ్రీ పండిట్ అంజుబాబు పర్యవేక్షించారు.
ఘనంగా సంత్ కబీర్ దాస్ జయంతి
