గోపీచంద్ ‘రామబాణం’ ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియో విడుదల

గోపీచంద్ ‘రామబాణం’ ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియో విడుదల
Spread the love

మాచో హీరో గోపీచంద్ రామబాణం ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘రామబాణం’ ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియోను విడుదల చేసిన మ్యూజికల్ జర్నీ ప్రారంభించారు.
మిక్కీ జె మేయర్ హై-స్పీడ్ బీట్‌లతో కూడిన మాస్ డ్యూయెట్‌ను కంపోజ్ చేశారు. అద్భుతమైన వోకల్స్, సూపర్బ్ డ్యాన్సులు, క్లాసీ విజువల్స్ తో ఇది మాస్ యుఫోరియాను సృష్టిస్తుంది. మాస్ పాటలు రాయడంలో స్పెషలిస్ట్ అయిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. తెలంగాణ యాసలో ఈ పాటను రాశారు. రామ్ మిరియాల, మోహన భోగరాజు వోకల్స్ లో కావాల్సిన ఎనర్జీ ఉంది.
గోపీచంద్, డింపుల్ హయాతి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మాస్ డ్యూయెట్ లో చాలా కూల్‌గా కనిపించి, రాకింగ్ కెమిస్ట్రీని పంచుకున్నారు. గోపీచంద్ స్టైలిష్ అవతార్‌లో కనిపించగా, డింపుల్ సూపర్-హాట్‌గా కనిపించారు. ఐఫోన్ మాస్ ని ఆకట్టుకుటుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం ఈ చిత్రానికి బలం చేకూర్చనున్నాయి. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్.
జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా.
సాంకేతిక విభాగం: దర్శకత్వం: శ్రీవాస్, నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జె మేయర్, డీవోపీ: వెట్రి పళనిసామి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కథ: భూపతి రాజా, డైలాగ్స్: మధుసూదన్ పడమటి, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, పీఆర్వో: ఎల్ వేణుగోపాల్, వంశీ-శేఖర్.

Related posts

Leave a Comment