ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా …
చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘ఎగ్రెసివ్ స్టార్, యాక్షన్ హీరో అయిన గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా మా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ను సెప్టెంబర్ 3న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. స్పోర్ట్స్ మూవీ అంటే ఎలా ఉండాలో అదే రేంజ్లో సినిమాను రూపొందించాం. గోపీచంద్‌గారు ఆంధ్ర టీమ్ కబడ్డీ కోచ్‌గా, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటించారు. ఇద్దరూ ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త పాత్రల్లో మెప్పిస్తారనడంలో సందేహం లేదు. వీరితో పాటు భూమిక, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి, రీసెంట్గా విడుదలైన జ్వాలా రెడ్డి సాంగ్, అప్సరా రాణి చేసిన స్పెషల్ సాంగ్ స్పెషల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా సినిమాకు మెలోడి బ్రహ్మ మణిశర్మగారి మ్యూజిక్, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అండ్ టీమ్ వర్క్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇక డైరెక్టర్ సంపత్ నందిగారి టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పర్‌ఫెక్ట్స్‌గా మిక్స్ చేసి ప్రతి సీన్ గ్రాండియర్‌గా, ఎగ్జయిట్‌మెంట్‌తో ప్రేక్షకులన అలరించేలా ఆయన సినిమాను డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 3న థియేటర్స్‌లో వస్తున్న మా సీటీమార్ చిత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆడియెన్స్‌కు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందని కచ్చితంగా చెబుతున్నాను’’ అన్నారు.
నటీనటులు:
గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అప్సర రాణి స్పెషల్ సాంగ్‌లో నటించింది.
సాంకేతిక వర్గం:కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నందినిర్మాత: శ్రీనివాసా చిట్టూరిబ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ సమర్పణ: పవన్ కుమార్సినిమాటోగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్సంగీతం: మణిశర్మఎడిటర్: తమ్మిరాజుఆర్ట్ డైరెక్టర్: సత్యనారాయణ డి.వై