కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్‌ని క‌లిసిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి నిర్మాత‌లు

sekhar Kammula And Producers Of Sree Venkateswara Cinemas LLP Meet Superstar Dhanush
Spread the love

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల్టీ- లింగ్వ‌ల్ మూవీ యొక్క అధికారిక ప్రకటన అందరి దృష్టిని ఆక‌ర్షించింది. క్రేజీ కాంభినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.4గా నారాయ‌ణ‌దాస్ నారంగ్‌, పుస్కూరు రామ్‌మోహ‌న్ రావు అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల‌లో తెర‌కెక్కించ‌నున్నారు..
దర్శకుడు శేఖర్ కమ్ముల మ‌రియు చిత్ర నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, భ‌రత్ నారంగ్ మ‌రియు పి. రామ్ మోహన్ రావు ఈ రోజు ధనుష్ ను హైదరాబాద్ లో కలిశారు. ధ‌నుష్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం # D43 షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు.
యూనివర్సల్ అప్పీల్ మరియు అత్యంత ప్రతిభావంతులైన నటుడు-దర్శకుడితో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే విధంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సోనాలి నారంగ్ సమర్ప‌కురాలు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్న‌త‌మైన న‌టులు,టెక్నీషియ‌న్స్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది చిత్ర యూనిట్‌. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మ‌రిన్ని వివరాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Related posts

Leave a Comment