టాలీవుడ్ లో ఇప్పుడు ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. అదీ.. ఓ రెండు సినిమాల మధ్య థియేటర్ల గొడవ. విషయంలోకి వెళితే.. ఆ రెండు సినిమాలు శ్రీకాంత్ ‘కోతలరాయుడు’, విశాల్ ‘సామాన్యుడు’. ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానున్నాయి.
శ్రీకాంత్ ‘కోతలరాయుడు’ ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదలవుతోంది. శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో పృద్వి, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయని, ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి చూడదగ్గ అంశాలు ఉన్నాయని, శ్రీకాంత్ పాత్ర అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని దర్శకుడు సుధీర్ రాజు చెబుతున్నారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘కోతలరాయుడు’ సినిమా మా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ పేర్కొంటున్నారు.
ఇక విశాల్ ‘సామాన్యుడు’ విషయానికొస్తే.. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 4న థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటారు కోలీవుడ్ స్టార్ విశాల్. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా ‘సామాన్యుడు’ ఓ యూనిక్ కంటెంట్ తో తెరకెక్కింది. డెబ్యూ డైరెక్టర్ తు ప శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా ఫిబ్రవరి 4 న ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ లలో విడుదల కానుంది.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ,ట్రైలర్ చూస్తే..ఫుల్ యాక్షన్ మోడ్లో ‘సామాన్యుడు’ సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అలాగే సెకండ్ సాంగ్ ‘మత్తెక్కించే’ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విశాల్ సరసన డింపుల్ హయతి నాయికగా నటించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘సామాన్యుడు’ సినిమాను టెక్నికల్ గా స్ట్రాంగ్ గా మార్చేశాయి.
ఇదంతా ఒకే.. మరి ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందనేగా మీ డౌటు? అక్కడికే వద్దాం.. శ్రీకాంత్ ‘కోతలరాయుడు’, విశాల్ ‘సామాన్యుడు’. ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానున్నాయి. అయితే.. ఈ రెండు చిత్రాల దర్శక నిర్మాతల మధ్య థియేటర్ల గొడవ చిలికి చిలికి గాలివానలా తయారైందట. ఆ థియేటర్స్ మావి అని ఒకరు, కాదు..కాదు.. ఆ థియేటర్స్ మావే అని ఇంకొకరు పేచీలమీద పేచీలు పెడుతున్నారట. తాజాగా ఈ థియేటర్ల మధ్య గొడవ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. కేవలం ఈ రెండు సినిమాల విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.. మరి ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందోనని చెప్పుకుంటున్నారు. అయితే.. శ్రీకాంత్ ‘కోతలరాయుడు’ దే ఈ విషయంలో పై చేయి కానుందని, థియేటర్లు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. చుద్దాం ఏంజరగనుందో ..అదీ.. సంగతీ!!