షార్ట్ ఫిల్మ్ రూపకల్పనకు నడుంబిగించిన సంస్థ
శ్రీకాకుళం నగరం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కు సమీపాన హండ్రెడ్ క్రియేషన్స్ ఆఫీసు కార్యాలయం బుధవారం ఆరంభమయింది. లఘు చిత్రాల రూపకర్త సతీశ్ పీస నేతృత్వాన ఇంకొందరు ఔత్సాహికుల సహకారంతో ఈ కార్యాలయం ఇకపై నడవనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు సతీశ్ పీస, రమణ మణిగాము మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా యువ దర్శకులను ప్రోత్సహిస్తూ, డబ్బింగ్, ఎడిటింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఔత్సాహిక నటీనటులకు మరిన్ని అవకాశాలు అందించేందుకు ఈ కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ స్పీకర్ ఓఎస్డీ, సీనియర్ జర్నలిస్ట్ ఇంజరాపు జయదేవ్, బన్నీ భాస్కర్, ప్రేమ్ సుప్రీమ్, జగదీశ్ డీజే, నారాయణ రావు, ఆజాద్, షేక్ జిలానీ, శివ చరణ్, పవన్, వినోద్వర్మ, సంతోష్, తరుణ్ మహేశ్, నాగేశ్వరరావు, శ్రీను సుంకర, రమేశ్ నారాయణ్, ఈశ్వర్, హిమ శేఖర్, నవీన్, భారత్, తరుణ్, సాయి, సంతు తదితరులు పాల్గొన్నారు.