యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ ని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బంధారపు మధు మాట్లాడుతూ… ”నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవికి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను. ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా శతవిధాల కృషి చేస్తాను. గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ గారికి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి పార్టీకి అన్ని విభాగాలలో బలోపేతం చేస్తూ నా విధిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రతిక్షణం కార్యకర్తలతో అధికారం కోసం పోరాడుతాను. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని బందారపు మధు గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Related posts
-
తెలంగాణ కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్
Spread the love సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ... -
ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం
Spread the love సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్... -
సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్
Spread the love వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె...