నాకంతా తెలుస్తూనే ఉంది
కరోనా, క్వారంటైన్ ల మధ్య
లాక్ డౌన్లలో నలిగిపోవడాలు
కోవిశీల్డో, కోవాగ్జినో వేసుకోకుండా
షూటింగులలో పాల్గొనలేమని
స్పష్టంగా తెలుస్తూనే ఉంది
సిన్మా టాకీసులు మూయడంతో
OTT ల తాకిడికి
వచ్చేవారికి, చూసేవారికి ఇదంతా
మూన్నాళ్ల ముచ్చటే అని
సుస్పష్టమౌతూనే ఉంది
ఎనకట ఎంతటి కష్టాన్నైనా
సినిమా కష్టాల్ర బాబు అనేటోళ్లు
ఇప్పుడు సినిమావోడే
మావి మాములు కష్టాలా
కరోనా కష్టాలని అనాల్సివస్తుందని
అర్థం అవుతూనే ఉంది
కరోనా కల్లోలంలో
బడా బిజినెస్ మేన్ లు సైతం
వ్యాపారాలు మార్చేసుకున్నారు
సినిమావోన్ని కదా
లైట్లు ఆరిపోయి అంతా చీకటైనా
మిణుకు మిణుకుమంటూ
నా ఆశ శ్వాసై వెలగడం కనిపిస్తూనే ఉంది
- భీమలింగారెడ్డి
9985410931