‘ఒక అమ్మాయితో..’ మోషన్ పోస్టర్ విడుదల

film news
Spread the love

ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్ ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఒక అమ్మాయితో…`కోవిడ్ టైమ్ కహానీ` అనేది ఉపశీర్షిక.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా  చిత్ర యూనిట్ పాత్రికేయులు సమక్షంలో చిత్ర మోషన్ పోస్టర్ ను ఘనంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా…
నిర్మాత గార్ల పాటి రమేష్ మాట్లాడుతూ…కోవిడ్ రిస్ట్రిక్షన్ దృష్ట్యా సినిమా లేట్ అయ్యింది. మంచి ఫీల్ గుడ్ మూవీలా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో యూత్ కు తగ్గ అంశాలతో పాటు థ్రిల్, కామెడీ, ఎమోషన్స్ ఇలా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఉంటుంది.ఇందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు మురళి గారు చాలా చక్కగా డిజైన్ చేశారు.ఈ సినిమా మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా తమ సొంత సినిమాలా ఫీల్ అయ్యి నటించడం జరిగింది.వారందరికీ నా ధన్యవాదాలు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
డైరెక్టర్ మురళి బోడపాటి మాట్లాడుతూ…కోవిడ్ టైం లో  కూడా మా చిత్ర టెక్నీషియన్స్, నటీనటులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ లను కన్విన్స్ చేసి 42 రోజులు మాతో షూటింగ్ లో పాల్గొని మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు వారందరికీ మా ధన్యవాదాలు.మాకు షూటింగ్ లో ఎటువంటి కష్టం రాకుండా మమ్మల్ని చూసుకుంటూ ఖర్చుకు వెనుకాడకుండా మాకు సపోర్ట్ గా నిలిచారు. త్వరలో విడుదల అవుతున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
సీనియర్ నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. సినిమాను కోవిడ్ టైం లో కూడా దర్శక,నిర్మాతలు చాలా కష్టపడి చేశారు.త్వరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులు మంచి హిట్ ఇవ్వాలి అన్నారు.
నటుడు శ్రీ రాగ్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
హీరో సూరజ్ పవన్ మాట్లాడుతూ..నా గత సినిమా చూసి ఇందులో అవకాశం ఇవ్వడం జరిగింది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
సంగీత దర్శకుడు కన్ను సమీర్ మాట్లాడుతూ….ఇందులో పాటలు చాలా బాగా వచ్చాయి.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను టి.వి సీరియల్స్ లో 700 పాటలు రాయడం జరిగింది.అలాగే సినిమాల విషయానికి వస్తే ఈ సినిమాతో 200 పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.దర్శకుడు మురళి గారు మంచి కథను సెలెక్ట్ చేసుకొని చక్కగా తెరకెక్కించాడు
ఇది చిన్న సినిమా అయినా ప్రతి భావంతులు తీసిన సినిమా ఇది అందరూ ఈ సినిమాను ఆదరించాలి అన్నారు.
కెమెరామెన్ రమణ మాట్లాడుతూ.. కరోనా టైంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ 42రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని సింగిల్ షెడ్యూల్ లో టాకీపార్ట్ పూర్తిచేయడం విశేషం అన్నారు.
విలన్ గా నటించిన సురేష్ మాట్లాడుతూ.. ఇందులో నేను విలన్ గా నటించడం జరిగింది. కోవిడ్ టైం లో కూడా పర్మిషన్ తీసుకొని ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతంగా చిత్రీకరించారు.టైటిల్ తగ్గట్టు సినిమా ఉంటుంది. దర్శక, నిర్మాత లకు ఈ సినిమా బిగ్ హిట్ ఇవ్వాలని అన్నారు.
తారాగణం: శీతల్ భట్, సూరజ్ పవన్, శ్రీరాగ్, గుర్లిన్ చోప్రా, రఘు కారుమంచి, అశోక్ కుమార్, శాంతి తివారీ, జబర్దస్త్ ఫణి, జీవన్, పటాస్ పవన్, కె. సురేష్ బాబు, సుశీల్ మాధవపెద్ది తదితరులు.
సాంకేతికవర్గం:
బ్యానర్: ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్
మూవీటైటిల్: ఒక అమ్మాయితో
క్యాప్షన్: కోవిడ్ టైం కహానీ
రచన, దర్శకత్వం: మురళి బోడపాటి
నిర్మాతలు: గార్లపాటి రమేష్, Dr. V. భట్
కెమెరామెన్ : రమణ
సంగీతం: కన్ను సమీర్
సినిమాటోగ్రఫీ: తోట వి.రమణ
ఎడిటర్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: పి.ఎస్. వర్మ
కొరియోగ్రాఫర్: భాను
పి.ఆర్.ఓ..లక్ష్మీ నివాస్

Related posts

Leave a Comment