ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ విజేతగా నట్టి కరుణ నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల భామలు పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో ఈ ఏడాది విన్నర్ గా నట్టి కరుణ పోటీపడి, విజయం సాధించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కుమార్తె అయిన నట్టి కరుణ తమ సొంత బ్యానర్ లో నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే నటన పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా హీరోయిన్ గా మారి సినిమాలను చేస్తున్న విషయం వేరుగా చెప్పనక్కరలేదు. అందులో భాగంగా ఆమె తొలి ప్రయత్నంగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన ‘డి ఎస్ జె” (దయ్యంతో సహజీవనం) చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదలై, నటిగా ఆమెకెంతో పేరుతెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో నటిగా మరింత పేరుతెచ్చుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కరుణ ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ గెలుచుకోవడంతో ఆమెకు మరింత క్రేజ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నట్టి కరుణ మీడియాతో కొద్దిసేపు ముచ్చటిస్తూ…వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో పోటీపడి, ఈ టైటిల్ ను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా, థ్రిల్లింగ్ గా ఉందని అన్నారు. త్వరలో గోవాలో, కేరళలో జరగబోయే అందాల పోటీలలో కూడా పాల్గొనబోతున్నానని అన్నారు. ఇక సినిమా రంగం విషయానికి వస్తే, తాజాగా తెలుగులో రూపొందుతున్న ఓ రీమేక్ చిత్రంలో నటిస్తున్నానని వివరిస్తూ,, ఇందులో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు నటించడానికి అవకాశం చక్కటి పాత్ర లభించిందని చెప్పారు. ఇంకా తమిళంలో ఓ చిత్రంలో నటించమని ఆఫర్ వచ్చిందని, అయితే ఆ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఓ అచ్చ తెలుగమ్మాయిగా తెలుగు చిత్రాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తూనే ఇతర బాషల చిత్రాలు చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నానని కరుణ తెలిపారు.
Related posts
-
ఒంటరి మహిళల కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ.. ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’పై ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్
Spread the love ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సంస్థ పని చేస్తోంది. ఈ క్రమంలో ఈ స్వచ్చంద సంస్థ... -
Bhakti TV – NTV Koti Deepotsavam from November 9..don’t miss it
Spread the love Kartika month is considered as the most auspicious month by all Hindus. The month... -
ఇద్దరూ ఇద్దరే : పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు!
Spread the love ఇద్దరూ ఇద్దరే .. పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు! ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ అద్భుత...