ఏ సురేష్ ప్రభు సమర్పణలో ఏ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై విజయ్, శీతల్ బట్ హీరో హీరోయిన్లు (నూతన పరిచయం) గా సురేష్ ప్రభు దర్శకత్వంలో ఏ.ఆర్ రాకేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-1 చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని హీరో, హీరోయిన్స్ పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
చిత్ర నిర్మాత ఏ ఆర్ రాకేష్ మాట్లాడుతూ ..సినిమా రంగంపై ప్రేమతో చాలా రోజుల నుండి సినిమా తీయాలనే ఆలోచనతో ఉండగా సురేష్ ప్రభు చెప్పిన కథల్లో ఈ సినిమా లైన్ వినిగానే చాలా కొత్తగా డిఫరెంట్ గా వుందని పించింది.అందుకే ఈ కథని సినిమాగా తీయాలని అనుకున్నాను.ఇదే నా మొదటి చిత్రమైనా నిర్మాణ విలువలకు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
చిత్ర దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ.. నిర్మాత రాకేష్ గారికి కథ చెప్పిన వెంటనే డీఫ్రెంట్ గా ఉంది. మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారు అందుకు ముందుగా ఆయనకు నా కృతజ్ఞతలు .ఇకపోతే ఈ సినిమా స్క్రీన్ప్ ప్లే పరంగా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఉత్కంఠభరితంగా వెళ్లే సస్పెన్స్ థ్రిల్లర్.ఈ రోజు నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ జరుపు కుంటున్నాము. ఈ చిత్రం ద్వారా విజయ్ శీతల్ బట్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం అని అన్నారు.
చిత్రం శ్రీను మాట్లాడుతూ.. దర్శకుడు సురేష్ ప్రభు గత 13 సంవత్సరాలుగా నాకు తెలుసు తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్. తనకు నిర్మాత రాకేష్ గారు దొరకడం.అలాగే సీనియర్ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా లభించడంతో సినిమాకు అద్భుతమైన రూపం వచ్చింది. ఇందులో నేను మంచి పాత్ర చేస్తున్నాను.నిర్మాణ బాధ్యతలు నామీద పెట్టారు.నా శక్తీ వంచన లేకుండా సహకరిస్తాను.ఈ సినిమా మా అందరికీ పెద్ద విజయం ఇవ్వాలని కోరుతున్నాను అన్నారు.
హీరో విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇందులో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ శీతల్ బట్ మాట్లాడుతూ.. నాకిది మొదటి చిత్రమైనా సీనియర్ నటులతో నటించే అవకాశం కల్పించారు దర్శక,నిర్మాతలు వీరికి నా కృతజ్ఞతలు అన్నారు
మాటల రచయిత ప్రశాంత్ శర్మ మాట్లాడుతూ… రెగ్యులర్ సినిమల్లా కాకుండా కొత్త ప్రయత్నం చేస్తున్నాం. స్క్రీన్ ప్లే మొత్తం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
షేకింగ్ శేషు మాట్లాడుతూ….ఇందులో నేను చేస్తున్న పాత్ర డిఫ్రెంట్ గా ఉంటుంది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుతున్నాను అన్నారు.
మూల కథా రచయిత గట్టు నరేందర్ మాట్లాడుతూ.. నేను రాసిన లైన్ దర్శక, నిర్మాతలకు నచ్చింది.సైకాలజీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
నటీనటులు: విజయ్, శీతల్ బట్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను,రవి వర్మ, అదుర్స్ రఘు, జ్యోతి తదితరులు
సాంకేతిక నిపుణులు:
ప్రజెంట్ : సురేష్ ప్రభు
బ్యానర్ : ఏ ఆర్ మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్ : ఏ ఆర్ రాకేష్
కో-ప్రొడ్యుసర్ : విద్యా గణేష్
లైన్ ప్రొడ్యూసర్ : చిత్రం శ్రీను
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : సురేష్ ప్రభు
మ్యూజిక్ : మహావీర
కెమెరా : రఫీ
మూలకథ : నరేంద్ర
రచన సహాకారం : ఎమ్. లక్ష్మణ్ బాబు, శ్రీధర్, సుంకరి మాటలు : ప్రశాంత్ శర్మ
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్