హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లిలోని కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఎస్.రేణుకా జెన్నీఫర్ చార్లెస్ కు నాగార్జున యూనివర్సిటీ పీహెచ్ డీ ప్రకటించింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో “ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాప్ట్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయ్ మెంట్ ” అనే అంశంపై రేణుక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్టీష్ డిపార్ట్ మెంట్ కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి.కనకదుర్గ పర్యవేక్షణలో రేణుక పీహెచ్ డీ పూర్తి చేశారు. గత 25 ఏళ్లుగా బోధనా వృత్తిలో ఉన్న లెక్చరర్ రేణుక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధినులకు సబ్జెక్ట్ లో మంచి పరిజ్ణానం ఉన్నప్పటికీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలను సాధించలేకపోతున్నారనే విషయాన్ని గుర్తించారు. ఇదే అంశంపై పరిశోధన చేశారు. ప్రస్తుతం రేణుకా జెన్నీఫర్ చార్లెస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ డీసీసీపీ విభాగం ఇంచార్జ్ హెచ్.వో.డిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ కు చెందిన రేణుకా జెన్నీఫర్ చార్లెస్ పాఠశాల విద్యాభ్యాసమంతా సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ లో జరిగింది. ఇంటర్ మీడియట్ సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో చదివారు. డిగ్రీ ఆంధ్ర మహిళా సభ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు.
Related posts
-
WANTED TEACHERS FOR THE USA
Spread the love WANTED TEACHERS FOR THE USA -
అత్యంత వైభవంగా సౌధామినీ వివాహం
Spread the love దూడల శ్రీనివాస్ గంగాధర్ ప్రధమ పుత్రిక చి!!.ల!!సౌ!! సౌధామినీ వివాహం చి!! శివ కుమార్ (శ్రీ స్వామి గౌడ్... -
బాణా సంచా ధరల మోత : ధరలతో కళతప్పుతున పండగలు!
Spread the love by -షేక్ వహీద్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ -9848787917 ధరల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని...