”ఎఫ్ 3 విడుదలై ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా దూసుకెల్తుంది. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైయింది” అని పేర్కొంది ఎఫ్ 3 టీమ్.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఎఫ్3 ‘మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తొమ్మిది రోజుల్లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసి హౌస్ ఫుల్ వసూళ్ళతో దూసుకుపోతున్న ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ‘ఫన్’టాస్టిక్ ఈవెంట్ చిత్ర బృందం, అభిమానులు కేరింతలతో వైజాగ్ లో గ్రాండ్ జరిగింది.
ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్ 3ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకి ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. వైజాగ్ అంటే నాకు చాల స్పెషల్. నా మొదటి సినిమా కలియుగ పాండవులు ఇక్కడే చేశాను. స్వర్ణ కమలం, గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో,మల్లీశ్వరి, గురు ఇలా చాలా సినిమాలు ఇక్కడ చేశాను. ఇక్కడ ఎఫ్ 3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వేడుక జరుపుకోవడం ఆనందంగా వుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు మంచి స్క్రిప్ట్ తో వచ్చారు. మీరు గొప్ప విజయాన్ని అందించారు. నారప్ప, దృశ్యం ఓటీటీ కి వెళ్ళడంతో అభిమానులు కొంత నిరాస చెందారు. అందుకే ఎఫ్ 3లో నారప్ప గెటప్ లో వచ్చి ఫ్యాన్స్ ని థ్రిల్ చేయాలనీ అనుకున్నాను. ఈ చిత్రానికి పని చేసిన టెక్నికల్ టీంకి, ఆర్టిస్ట్ లకి అందరికీ థాంక్స్. ఈ ఈవెంట్ లో లేడి , ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వుండటం ఆనందంగా వుంది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు” అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు, అభిమానులందరికీ థాంక్స్. 200 మంది ఆర్టిస్ట్ లతో రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి రెండున్న గంటల పాటు మీరు ఆనందంగా వుండాలని సినిమా తీసి మీ ముందుకు తెచ్చాం. డబ్బులు, కలెక్షన్స్ ఇవ్వలేని తృప్తి.. మీరు సినిమా చూశాక శభాస్ అంటే వస్తుంది. అది మాకు వందకోట్లు. ఎఫ్ 3 సినిమాకి మీరు చూపిన ఆదరణే మాకు వంద కోట్లతో సమానం. డీవోపీ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, లిరిక్ రైటర్స్, ఎడిటర్ , కెమరా వెనుక వున్న టెక్నికల్ టీం అందరికీ థాంక్స్. రాజేంద్ర ప్రసాద్ గారికి, అలీ, సునీల్, రఘుబాబు గారు.. ఇలా ఆర్టిస్ట్ లందరికీ కృతజ్ఞతలు. ఆర్టిస్ట్ లందరికీ మంచి పేరు వచ్చింది. దీనికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి గారు. ఇంతమంచి సినిమా ఇచ్చిన అనిల్ గారికి కృతజ్ఞతలు. ఆయనకి ఒక యునిక్ స్టయిల్ వుంది. దాని వలనే వరుసగా ఆరు హిట్లు కొట్టారు. ఆరే కాదు ఇంకో ముఫ్ఫై ఆరు హిట్లు కొట్టాలి. నిర్మాత దిల్ రాజు గారు సినిమా పై ప్యాషన్ వున్న ప్రొడ్యుసర్, ఆయన చూడని కోట్లు లేవు. అయినా సినిమాని ఎంతో ప్యాషన్ తో చేస్తారు. వెంకటేష్ గారితో పని చేసిన ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇకపై వెంకటేష్ గారితో కాంబినేషన్ అంటే కథ అడగకుండా సినిమా చేసేస్తాను. వెంకటేష్ గారు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. వైజాగ్ తో నాకు చాలా కనెక్ట్ వుంటుంది, నేను రాసే ప్రతి స్క్రిప్ట్ ఇక్కడ నుండే మొదలుపెడతాను. ఎఫ్ 3 ని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది తొమ్మిదో రోజు. వందకోట్లు క్రాస్ చేశాం. ఈ క్రెడిట్ ప్రేక్షకులకు దక్కుతుంది. ‘F2’ ఫ్రాంచైజీని కొనసాగించవచ్చనే ధైర్యాన్ని ఎఫ్ 3 విజయంతో ఇచ్చారు. ఈ సినిమాని నవ్వుకోవడాకే తీశామని మొదటి నుండి చెబుతూనే వున్నాం, ఈ రోజు ఆ నవ్వుల విలువ వందకోట్ల రుపాయిలతో తిరిగిచ్చారు. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే నిర్మాత దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థాంక్స్. అలీ , రాజేంద్ర ప్రసాద్ తో పాటు నటులందరికీ కృతజ్ఞతలు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి థాంక్స్. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, దిల్ రాజు గారికి బిగ్ హాగ్. ఈ సినిమా కోసం ఏది అడిగితె అది ఇచ్చి ముందుండి నడిపించారు. ఎఫ్ 2కి వచ్చిన కలెక్షన్ కంటే ఎఫ్ 3 కి వచ్చిన కలెక్షన్స్ కిక్ ఎక్కువ కిక్ ఇస్తున్నాయి. కారణం అప్పుడు పరిస్థితతులు వేరు.ఇప్పుడున్న పరిస్థితితో మీరంతా థియేటర్ కి వచ్చి వందకోట్లు కలెక్షన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఎఫ్ 2కంటే ఎఫ్ 3 ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ముందు నుండి ఇదే చెప్పాం. ఇప్పుడు అదే నిజమైయింది. ఎఫ్ 4ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది. ‘F2’ ఫ్రాంచైజీ మీరు హాయి నవ్వుకోవడానికే.” అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. నా, మన అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకు, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మా ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎఫ్ 3 ని ఆదరించిన ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు కుటుంబాలకు స్పెషల్ థాంక్స్. కరోనా తర్వాత ఫ్యామిలీస్ థియేటర్ రావడం తగ్గించారని వినిపించించి కానీ ఇప్పుడే జగదాంబ థియేటర్ ఓనర్ గారు షోలన్నీ ఫ్యామిలీస్ తో నిండిపోతున్నాయని చెప్పారు. మంచి సినిమాలు ఇస్తామని మా సంస్థపై నమ్మకం వుంచిన తెలుగు ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి ధన్యవాదాలు, ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా ముందుకు వెళుతుంది. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైయింది. ఈ విజయం క్రెడిట్ అనిల్ రావిపూడికి దక్కుతుంది. నవ్వించాలానే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నానని చెప్పి కడుపుబ్బా నవ్వించారు. ఎఫ్ 3 చుసిన ప్రేక్షకులంతా సినిమాని తెగ ఎంజాయ్ చేశామని చెబుతుంటే చాలా ఆనందం అనిపించింది. జగదాంబ లో పదకుండు వందల సీట్లు ఫిల్ కావడం అంటే మామూలు మాటలు కాదు. ఇది విశాఖ పట్నం ప్రేక్షకుల వల్ల సాధ్యమైనందుకు చాలా హ్యాపీ. వెంకటేష్ , వరుణ్ గారు ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ లోకి తీసుకెళ్ళినందుకు థాంక్స్. తమన్నా, మేహరీన్, పూజా, సోనాల్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ ఎంతో మంది ఆర్టిస్ట్ లతో సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాం మీరు గొప్పగా ఆదరించారు. ఎఫ్ 4ని ఎలా చేయాలనే టెన్షన్ ఇప్పటి నుండే అనిల్ రావిపూడికి పట్టుకుంది. లాజికల్ గా మ్యాజికల్ గా చింపే సినిమా చేద్దాం అదే మన గోల్. ఎఫ్ 4కోసం వెయిట్ చేస్తుండండి. త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎఫ్ 3 ప్రీరిలీజ్ లో ఈవెంట్ లో ఈ సినిమా హిట్ కాకపొతే మళ్ళీ మీ ముందు కనిపించనని ఛాలెంజ్ చేశాను. చాలా మంది మిత్రులు, మీడియా వారు ఆశ్చర్య పోయారు. కానీ నాకు నవ్వు, ప్రేక్షకులపై వున్న నమ్మకం. ఈ రోజు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నా నమ్మకం వమ్ముకాలేదు. తెలుగు ప్రేక్షకులు వినోదం పంచె సినిమాలకు న్యాయం చేస్తారు,ఎఫ్3తో మరోసారి రుజువు చేశారు, ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. వెంకటేష్, వరుణ్ తేజ్ ,. సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. అన్ని పాత్రలకు మంచి పేరు రావడం చాలా అరుదు. ఈ క్రెడిట్ అనిల్ రావిపూడి గారికి దక్కుతుంది. ఇంత పెద్ద చిత్రాన్ని అందించిన నిర్మాత దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. రామానాయుడు గారి తర్వాత నేను దిల్ రాజు గారిని మూవీ మొఘల్ అని పిలుస్తాను. దిల్ రాజు గారు మన దిల్ లో వుండే నిర్మాత. నిర్మాత శిరీష్ గారంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎఫ్3ని ఇంత చక్కగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” అన్నారు