జాతీయ అవార్డ్ గ్రహీత తనీష్ ఛటర్జీ, వెర్సటైల్ యాక్టర్ సత్య ఫేమ్ జె.డి.చక్రవర్తి ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నైజీరియాలో జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దహిణి సినిమాను ప్రదర్శించారు. ఆ చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటిగా తనీష్ ఛటర్జీ, ఉత్తమ సహ నటుడిగా జె.డి.చక్రవర్తి అవార్డులను గెలుచుకున్నారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకులు ప్రశంసలు అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో దహిణి చిత్రం తెరకెక్కింది. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత సునీతా కృష్ణన్ ఈ సినిమాను నిర్మించారు.
తెలుగు సినిమాల్లోనే కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ఇండియన్ సినిమాల్లోనే విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న జె.డి.చక్రవర్తి తొలిసారి దహిణి చిత్రంతో అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో తను ప్రతాప్ బాబు అనే సామాజిక కార్యకర్తగా కనిపించారు. సమాజంలో మంచి కోసం నిరంతం పోరాడే పాత్రలో తను ఒదిగిపోయారు. ఆయన పెర్ఫామెన్స్‌ని జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో కలిపి జె.డి.చక్రవర్తి 80కి పైగా సినిమాల్లో నటించారు. స్క్రీన్ అవార్డ్, నంది అవార్డులను గెలుచుకున్న ఆయనకు ఇదే తొలి ఇంటర్నేషనల్ అవార్డ్. అంతర్జాతీయ స్థాయి నటులు ఓలే ఓజో, షఫీ బెల్లో వంటి వారితో చక్రవర్తిని వేదికను పంచుకున్నారు.
‘నటుడిగా ఈ అవార్డు నా గౌరవాన్ని మరింత పెంచింది. చాాలా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో నటన గుర్తింపు దక్కించుకోవటం సాధారణ విషయం కాదు. దీనికి కారణమైన మా దర్శకుడు రాజేష్ టచ్ రివర్ గారికి, నిర్మాత సునీతా కృష్ణన్‌గారికి థాంక్స్’’ అన్నారు జె.డి.చక్రవర్తి.
రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన దహిణి సినిమా ఓ సోషల్ థ్రిల్లర్. మంత్రగత్తె అన్వేషణకు సంబంధించిన చిత్రమిది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకుంది. మంత్రగత్తె అన్వేషణ అనే పాయింట్ వెనుకున్న కఠోనమైన నిజాన్ని ఈ సోషల్ థ్రిల్లర్ తెలియజేస్తుంది. ఇప్పటికీ ఇది మన దేశంలో 17 రాష్ట్రాల్లో కొనసాగుతోంది. మంత్రగత్తె అన్వేషణ అనే బోల్డ్ పాయింట్‌ను సినిమాను తెరకెక్కించటం మామూలు విషయం కాదు. మరోసారి ఈ చిత్రం ద్వారా ఆయన మానవ హక్కుల ఆందోళనను ప్రస్తావించారు. ఇది మనదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఉన్న సమస్యల్లో ఒకటి. లింగ ఆధారిత హింసను దీంతో ప్రోత్సహించటాన్ని ఖండించాల్సిన విషయం. దీని ద్వారా వేలాది మంది ఆడ శిశువులను చంపటానికి మంత్తగత్తెను ఉపయోగించేవారు.
మంత్రగత్తెల ప్రభావం ఎక్కువగా ఉండే ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఈ సినిమాను పూర్తిగా చిత్రీకరించారు. దీంతో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌ను వెలుగులోకి తెచ్చినట్టయ్యింది.
అషికీ హుస్సేన్, బద్రూల్ ఇస్లాం, అంగనా రాయ్, రిజ్జు బజాజ్, జగన్నాథ్ సేతు, శ్రుతీ జయన్, దిలీప్ దాస్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు నటించిన ఈ చిత్రానికి అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సినిమాటోగ్రాఫర్‌గా నౌషద్ షరీష్, ప్రొడక్షన్ డిజైనర్‌గా సునీల్ బాబు, సౌండ్ డిజైనర్‌గా అజిత్ అబ్రహం జార్జ్, బ్యాక్ గ్రౌండ్ స్కోరర్‌గా జార్జ్ జోసెఫ్, ఎడిటర్‌గా శశి కుమార్, ఎన్.జి.రోషన్ మేకప్, డైలాగ్స్‌ను పున్నం రవి అందించారు. రామ్ లీల ప్రొడక్షన్స్, సన్ టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సినిమా రూపొందింది.