(T-Times News – ALER)
ఉపాధ్యాయుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అన్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళ ఉపాధ్యాయులు గుండెపోటుతో బలవన్మరణానికి పాల్పడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త నియామకాలు చేయకపోగా, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా జిల్లాలను విభజించి ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు పంపిస్తూ వారి కుటుంబాలలో నిప్పులు పోస్తున్నారని దుయ్యబట్టారు. భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేయాలనే నిబంధనలు తుంగలోకి తొక్కార ని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని నీలం పద్మ వెంకటస్వామి స్పష్టం చేశారు.