సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ…
”డైరెక్టర్ ఓ ఫోటో సెషన్ చేద్దాం అన్నారు. సరే అండి అని చేశాం. హైదరాబాద్ నుంచి లడక్ కి ఓ జర్నీ ఉంటుంది. ఏదో రఫ్ గా చేసి ఆ ఫొటోస్ పంపించా. ఇది ఫైనల్ కాదనుకున్నా. డైరెక్టర్ చూసి నాకు ఇదే కావాలన్నారు. మొత్తం సినిమాలో అదే మెయిన్ టైన్ చేసాం.
ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్ గారికి లడక్ లో ఓ స్టోరీ ఉంటుంది. ఆయనకు డబ్బు అన్నీ ఉన్నాయి. ఆయన కావాలంటే ప్రైవేట్ జెట్ ఫ్లయిట్ లో వెళ్లొచ్చు. కానీ ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆయనకు బైక్ రైడ్ అంటే ఇష్టం. ఫీల్ కోసం బైక్ లో స్టార్ట్ అవుతారు. అలాగే భూమిక గారికి ఓ గోల్ ఉంటుంది. భూమిక గారి ఫాదర్ గోల్ ఫుల్ ఫిల్ చేయడానికి భూమిక గారు స్టార్ట్ అవుతారు. ఆలాగే అమ్మాయికి ఒక గోల్. అలాగే అజయ్ క్యారెక్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ ఫెలో. ఇతనికి లడక్ లో స్నో మీద ఓ రేస్ ఉంటుంది. ఆ రేస్ గెలిస్తే ఆసియా లెవెల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా వీళ్లంతా బయల్దేరి ఎక్కడ కలుసుకున్నారు? కలుసుకున్నారా లేదా.. ఆ జర్నీ అంతా ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యారా లేదా? అనేది కథ.
ఒక్కొక్కరూ సపరేట్ గా స్టార్ట్ అవుతారు. నాలుగు కథలకు లింక్ అనేది.. మధ్యలో మంచి ఫ్రెండ్ షిప్, బ్యాండ్ క్రియేట్ అయి ముందుకెళ్తారు. ఎవరి గోల్ వారు ఫుల్ ఫిల్ చేసుకోవాలని హెల్ప్ చేసుకుంటారు. కథ చెప్పింది కరోనా ముందు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో అనుకున్నాం. అప్పుడే వ్యూహాన్ లో స్టార్ట్ అయ్యాం. సెకండ్ షెడ్యూల్ టైంలో కరోనా వల్ల లాక్ అయ్యాం.
తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ చూపించడం వల్ల అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. కథలో రోల్స్ ఇన్వాల్మెంట్ ఉండాలి. ఇందులో అవన్నీ ఉన్నాయి. కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాను. అందరికీ ఫ్లష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవీ లేవు కానీ శ్రీకాంత్ గారికి ఉంది. లాస్ట్ లో 20 మినిట్స్ స్నో మీద రైడ్, రేస్ ఆసక్తికరంగా ఉంటుంది. బైక్ నన్ను మాదాపూర్ నడపమంటే నడిపేస్తా. కానీ స్నో మీద చాలా రిస్క్. అందుకే స్నో మీద చాలా ప్రాక్టీస్ చేసి షూటింగ్ చేశాం. లక్కీగా ఎవ్వరికీ ఏమీ యాక్సిడెంట్ లాంటివి జరగలేదు.
భూమిక గారు కూడా చాలా డేర్ చేశారు. డూప్స్ పెట్టి చేయొచ్చు. కానీ రియలిస్టిక్ గా ఉండేందుకు ఆమెనే చేశారు. ఒక్కడు తర్వాత ఆవిడతో డైరెక్ట్ కాంటాక్ట్ ఇదే. నా చిన్న తనంలో ఫిలిం చాంబర్ లో భూమికను చూసి భలే ఉంది హీరోయిన్ అనుకున్నా. ఆవిడతో ఒక్కడు సెట్ లో మంచి రిలేషన్ ఏర్పడింది. ఆవిడతో నేరుగా యాక్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇది ఎక్సలెంట్ ఫీలింగ్.
ఈ సినిమాలో ఒక్క సీన్ లో భూమిక గారు నా బైక్ ఎక్కుతారు. ఆ సీన్ షూట్ చేసినప్పుడు గానీ, మళ్ళీ చూసినప్పుడు గానీ గూస్ బంప్స్ వచ్చాయి. అక్క అనే రిలేషన్ ఉంటుంది. నాకు తాన్యా హాప్ కి లవ్ ట్రాక్ నాచురల్ గా ఉంటుంది. డైరెక్టర్ గురు మంచి రైటర్. ఈ సినిమా స్టార్ట్ కాక ముందే మాకు ఈజీ కావాలని ఆయనే స్వయంగా తిరిగి టెస్ట్ చేశారు, చాలా రీసెర్చ్ చేశారు. అది డైరెక్టర్ కి డెఫినెట్ గా ఉండాలి. ఆయనకు ఏ బైక్ ఎంత సీసీ ఉంటుంది. గేర్ల పట్ల చాలా అవగాహన ఉంది. గురు మైండ్ లో పక్కా కమర్షిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని నాచురల్ గా మలిచి సినిమా రూపొందించారు.
అంతకుముందు ఆ తర్వాత, లవర్స్ లాంటి సినిమాలు చేశా. ప్రతి ప్రాజెక్టు నుంచి ఓ అనుభవం వచ్చింది. నా సినీ జర్నీలో చాలా నేర్చుకున్నా. నేను చాలా హ్యాపీ. కారులో కంటే బైక్ లో వెళితే ఆ కిక్కే వేరు. మైనస్ డిగ్రీస్ లో చాలా సన్నివేశాలు షూట్ చేశాం. బైక్ అనేది రియల్లీ ఫన్. అందుకే చాలా మంది రైడర్స్ వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. నా తదుపరి సినిమా 7 డేస్ 6 నైట్స్ షూటింగ్ కూడా పూర్తయింది.
మా నాన్నగారికి ఒకే టైపు లో సినిమాలు తీయడం ఇష్టం ఉండదు. అందుకే డిఫరెంట్ ఒరింటెడ్ సినిమాలు తీస్తారు. లో బడ్జెట్, హై బడ్జెట్, గ్రాఫిక్ ఇలా అన్ని కోణాలు టచ్ చేస్తున్నారు. నిర్మాత అనేది చాలా టఫ్ జాబ్. ప్రొడ్యూసర్ కి ఏదన్నా తేడా వస్తే కష్టం. అందుకే అంతా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ కష్టం ఏంటనేది. అయితే ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆ థ్రిల్ ఏంటనేది తెలుస్తుంది. ఇదే మా కథలో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, లొకేషన్స్ అనేవి హైలైట్స్.