టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. ఆమె నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో’ హిట్స్‌గా నిలిచాయి. అందుకే ‘యాక్టర్‌గా ఇది నా బెస్ట్ టైమ్’’ అంటున్నారు పూజా హెగ్డే. అంతే కాదు ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలు చేస్తున్నారామె. హిందీలో .. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలీ’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’ సినిమాలు చేస్తున్నారు. వరుస విజయాలు, వరుసగా పెద్ద సినిమాల్లో నటించడం గురించి పూజా హెగ్డే చెబుతూ.. ‘‘వృత్తిరీత్యా ఇది నా బెస్ట్ టైమ్ అనిపిస్తోంది. నేను ఎప్పటినుంచో పని చేయాలనుకుంటున్న అందరితో పని చేయగలుగుతున్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందనిపిస్తోంది’’ అన్నారు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో దుల్కర్ మిలటరీ వ్యక్తిగా కనిపిస్తారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను స్వప్నా దత్ నిర్మించనున్నారు. ఇందులో దుల్కర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు, మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఒకవేళ పూజా హెగ్డే ఈ సినిమా కమిట్ అయితే ఆమె మాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు
‘ఇదే నా బెస్ట్ టైమ్’ అంటోంది పూజా హెగ్డే!
