-ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశం మార్కెట్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధి కోసం రూ. 10 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు, రాజపేట సబ్ యార్డు లో 2500 మెట్రిక్ టన్నుల గోదాం పూర్తయింది. త్వరలో రైతులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు , మార్కెట్ సెక్రటరీ చంద్ర శేఖర్ గుప్తా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొగులగాని మలేష్ గౌడ్, ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి బూడిద ఐలయ్య, గుంటి కృష్ణ, గుగులోతు బద్ధు నాయక్, పత్తిపాటి మంజుల, సత్యనారాయణ, మామిడాల నర్సింహులు, రవీందర్, జంగా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు