యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గ్రామపంచాయతి ఏర్పడిన నాటినుండి ఉన్న భవనాన్ని తాత్కాలిక మార్పు పేరుతో తరలించవద్దని సోమవారం అఖిలపక్ష కమిటీ కన్వీనర్ తునికి ధశరధ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.మున్సిపల్ కార్యాలయం ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ఏకపక్షంగా వ్యవహరించి తన నివాసానికి సమీపంలో ఉన్న వెలుగు కార్యాలయం వద్దకు మార్చుతున్నారని ఆరోపిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేసారు.ఒకానొక సందర్భంలో అసమర్ద చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న చైర్మన్ శంకరయ్య నిరసన ధర్నా వద్దకు రాగా తరలింపును మానుకోవాలని అఖిలపక్షాల నేతలు నిలదీసారు. ఈ సంధర్భంగా మున్సిపల్ కార్యాలయం ప్రమాదకరంగా ఉన్నదని తరలింపు తాత్కాలికమని చైర్మన్ సమాధానం ఇవ్వడంతో నిరసన తెలుపుతున్న నాయకులు ఉవ్వెత్తున లేచి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పాత కార్యాలయం పరిసర ప్రాంతంలో ఉన్న ఆర్ అండ్ బి కార్యాలయంలోకి మార్చితే అభ్యంతరం లేదని అన్నారు.పట్టణ ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా స్వంత నిర్ణయంతో తన నివాసానికి సమీపంలోకి తరలించవద్దని డిమాండ్ చేశారు.ఈసంధర్భంగా తన మట్టుకు తాను వెళ్లిపోవడం చూసిన నిరసనకారులు కారు ముందు బైఠాయించి చైర్మన్ డౌన్ డౌన్ అంటూ వెంటనే రాజీనామా చేయాలని తరలింపుపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో రెండు రోజులలో అఖిలపక్ష పార్టీ లతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లోనూ పాత కార్యాలయ ఆవరణలోనే నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మాణం అవుతుందని తాత్కాలికంగా మార్పుకు సహకరించాలని కోరడంతో ధర్నా కార్యక్రమం విరమించారు.ఈకార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు చెక్క వెంకటేష్, ఎంఏ ఎజాస్,సంగు భూపతి ,కట్టెగొమ్ముల విద్యాసాగర్ రెడ్డి, ఎండి సలీం,చింతలపణి శ్రీనివాస్ రెడ్డి,బడుగు జహంగీర్, పసుపునూరి వీరేశం తదితరులు ఉన్నారు.
ఆలేరు మున్సిపల్ కార్యాలయం తరలించవద్దు : అఖిలపక్షాల ధర్నా
