ఆలేరు జర్నలిస్టులకు ‘ఆరాధన’ పురస్కారాలు

aler news
Spread the love

హైద్రాబాద్ లోని ‘ఆరాధన’ సంస్థ తన 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించాయి


యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పాత్రికేయులు హనుమకొండ ఉపేంద్రాచారి (మహా న్యూస్), గుండు మధుసూదన్ (సత్య ఛానల్)లకు ‘ఆరాధన’ పురస్కారాలు వరించాయి. హైద్రాబాద్ లోని ‘ఆరాధన’ సంస్థ తన 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించాయి. ఈ సందర్బంగా ‘ఆరాధన’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి లోకం కృష్ణయ్య ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గత 25 ఏళ్లుగా తమ సంస్థ వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఎందరినో సత్కరించి పురస్కారాలను అందజేస్తోందని తెలిపారు. దానిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పాత్రికేయులు హనుమకొండ ఉపేంద్రాచారి (మహా న్యూస్), గుండు మధుసూదన్ (సత్య ఛానల్)లకు ‘ఆరాధన’ పురస్కారాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. హనుమకొండ ఉపేంద్రాచారి ప్రస్తుతం ‘మహా న్యూస్’ లో పనిచేస్తూ పాత్రికేయునిగా సామాజిక సేవలోనూ పాలుపంచుకుంటున్నారని, గతంలో టి-2, బీటీవి, స్టూడియో-ఎన్, 6 టివిలలో పనిచేసిన అనుభవం ఉందని, అంతే కాకుండా , హైదరాబాద్ కు చెందిన పేరెంట్స్ అసోసియేషన్ కు 8 ఏళ్లుగా ఉపాధ్యక్షునిగా కొనసాగారని, 5 ఏళ్లపాటు మానవ హక్కుల సంఘంలో తనవంతు సేవలను నిర్వర్తించారని, లోక్ సత్తా అధినేత డా. జయప్రకాష్ నారాయణతో కలసి లోక్ సత్తా ఉద్యమ సంస్థ నుంచి 2014 వరకు పలు ప్రజా సమస్యలపై పోరాటం చేసారని, అలాగే ‘సత్య ఛానల్’ ద్వారా గుండు మధుసూదన్ తనవంతు సేవను విస్తృత పరుస్తున్నారని వీరి సేవలను గుర్తించి ఈ ‘ఆరాధన’ పురస్కారాలకు ఎంపిక చేసినట్టు లోకం కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ‘ఆరాధన’ 26వ వార్షికోత్సవంలో ఈ పురస్కారాలను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆరాధన’ 26వ వార్షికోత్సవంలో వివిధ రంగాలకు చెందిన అతిరధ మహారధులు పాల్గొంటారని ఆయన తెలిపారు

Related posts

Leave a Comment