‘బాహుబలి’ చిత్రం తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ తో పాటు ప్రాజెక్ట్ కె, సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో మూడు సినిమాలను చేస్తూ ఆయన యమ బిజీగా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. సాహో, రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’ కావడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ ఆలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ , హనుమంతుడిగా దేవ్ దత్త నటించారు. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైనప్పుడు ‘ఆదిపురుష్’ టీమ్ అభిమానుల నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే! దీంతో ఈ సినిమాలోని మొత్తం గ్రాఫిక్స్ వర్క్‌ను మార్చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా పడింది. ఇదిలా ఉండగా ‘ఆదిపురుష్’నుండి మరో కొత్త సమాచారం తెలిసింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుండి మరో అప్ డేట్ రానుందని యూనిట్ చెప్పుకుంటున్నారు. మరో టీజర్‌ను ప్రేక్షకుల్లోకి వదలనున్నట్లు తెలుస్తోంది. అందుకు రంగం మొత్తం రెడీ అయిందట. అంతేకాదు.. ఈ చిత్రానికి సంబంధించి మెరుగైన గ్రాఫిక్స్ కోసం ఈ ప్రాజెక్ట్‌పై ‘ఆదిపురుష్’ టీమ్ రీవర్క్ చేస్తుందట. అందుకోసం సుమారు 100 -150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రామాయణ కథా కావ్యానికిదృశ్య రూపంగా రానున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతుందట. అయితే.. ఈ ‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని జోరుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ వరల్డ్ మార్కెట్ పై ఎంతో పోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా విడుదల కానుంది. ఆదిపురుష్, సలార్ సినిమాలు కూడా అదే బాటలో వస్తున్నాయి. దీంతో ప్రభాస్ మూడు సినిమాలు ప్యాన్ వరల్డ్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. చూడాలి మరి.. ఈ సినిమాల్లో ప్రభాస్ తన నటనతో ఎలా అలరిస్తాడో..!?
Related posts
-
లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం.. ‘డియర్ కృష్ణ’ మూవీ టీమ్ వినూత్న కాంటెస్ట్
Spread the love ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అనుభూతితో పాటు, అదృష్టాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా చాలా... -
Telugu DMF Creators and Influencers Awards 2024: Celebrating South India’s Digital Excellence
Spread the love The much-anticipated Creators and Influencers Awards 2024, presented by Truzon Solar by Suntek, concluded... -
మారిన ‘ఉద్వేగం’ విడుదల తేదీ..నవంబర్ 29న విడుదల
Spread the love నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న కోర్టు డ్రామా కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్...