పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఇతిహాసిక చిత్రం “ఆదిపురుష్” ఇటీవలే విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న ఈ సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. “ఆదిపురుష్” మేకింగ్ లోని సాంకేతికత, భారీతనం, విజువల్స్ ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలోని కొన్ని సంభాషణల విషయంలో కొంతమంది ప్రేక్షకులు సూచనలు చేస్తున్నారు. వారి సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ “ఆదిపురుష్” చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయి. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో “ఆదిపురుష్” ను చూడవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి విజయం వైపు వెళ్తున్న ఈ చిత్రంలోని డైలాగ్స్ మార్పులు సినిమా టీమ్ కు ఒక సాహసం లాంటిదే అయినా ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యమని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...