ఘనంగా జరుపుకున్న ZEE 5, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ “హలో వరల్డ్” వెబ్ సిరీస్ ప్రి రిలీజ్ ఈవెంట్
ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ,మరియు టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ పేపర్ రాకెట్’. లు కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచుకున్నాయి. తాజాగా సదా, ఆర్యన్ రాజేష్ లు కూడా OTT అరంగేట్రం చేసిన 8-ఎపిసోడ్‌ల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ‘ ఆగస్టు 12 నుండి ZEE 5 లో స్ట్రీమ్ లో అవుతూ వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ వెబ్ సిరీస్ వీక్షకులకు ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది. దీని ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేశారు. కార్పొరేట్ ప్రపంచం లోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను అన్వేషించే డ్రామాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై తో కలసి నిహారిక కొణిదల కొలబ్రేషన్ తో ZEE5 నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు శివసాయి వర్ధన్ జలదంకి చాలా చక్కగా తెరకేక్కించడం జరిగింది .. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న “హలో వరల్డ్” వెబ్ సిరీస్ ఈ నెల 12 న ZEE5 లో స్త్రీమ్ అవుతున్న సందర్బంగా “హలో వరల్డ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని టి. హబ్ లో వెబ్ సిరీస్ టీం ఘనంగా జరుపు కున్నారు.ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నేహా శెట్టి మరియు ZEE5 టీం రాధా గారు, సాధిక గారు ,సాయి తేజ్ ,ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..
నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. అడిగిన వెంటనే వచ్చిన విశ్వక్ సేన్, నేహా శెట్టి లకు ధన్యవాదములు.ఐటి లో పని చేయడానికి వచ్చిన యువతీ యువకుల అనుభవాలతో రూపిందించిన రొమాంటిక్ డ్రామా గా వస్తున్న హలో వరల్డ్ వెబ్ సిరీస్ పింక్ ఎలిఫెంట్ కు మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను . దర్శకుడు సాయి చాలా టఫ్ డెడ్ లైన్స్ తో చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు.తన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది.టెక్నీకల్ టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు నటీ నటులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు.ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి కూడా థాంక్స్ చెప్పాలి. ఇందులో కొంతమంది చిన్న క్యారెక్టర్స్ చేసిన కూడా చాలా బాగా చేశారు OCFS చేసిన దర్శకుడు మహేష్ గారు కూడా నాకు బ్యాక్ బోన్ గా ఉండి హెల్ప్ చేశారు.అలాగే నాకు సపోర్ట్ గా నిలిచిన ZEE5 టీం కు ధన్యవాదములు అన్నారు.
గెస్ట్ గా వచ్చిన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నాది కూడా ఐ టి బ్యాచ్. యుంగ్ టీంతో నిహారిక చేస్తున్న ఈవెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వాలి. టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.
గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ..ఐటీ లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారి టైమింగ్స్ వర్క్ స్టైల్ తెలుసు. ఇందులో వర్క్ చేసిన సదాగారికి ఆర్యన్ గారికి ధన్యవాదములు.ఈ హలో వరల్డ్ వెబ్ సిరీస్ లో వర్క్ చేసిన టీం అందరికీ అల్ ధ వెరీ బెస్ట్ అన్నారు.
ప్రార్ధనగా నటించిన సదా మాట్లాడుతూ.. నేను ఫస్ట్ టైమ్ వెబ్ సిరీస్ లో వర్క్ చేస్తున్నా కూడా సినిమాలో చేస్తున్న ఫీలింగే కలిగింది తప్ప వెబ్ సిరీస్ లో చేస్తున్న ఫీలింగ్ కలగలేదు. ఈ సిరీస్ లో జాయిన్ అయ్యే వరకు నిహారిక ఆల్రెడీ సక్సెస్ ఫుల్ ప్రాజెక్టు చేసినట్టు తెలియదు. ఒక మంచి స్ట్రాంగ్ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ప్రార్ధన క్యారెక్టర్ లో నటించిన నేను దర్శకుడు సాయి గారు మాతో మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు ఇలాంటి మంచి టీం తో చేసినందుకు చాలా సంతోషంగా వుంది. ZEE 5 లో స్త్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ను అందరూ చూసి కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆన్నారు
దర్శకుడు శివ సాయి మాట్లాడుతూ.. కొత్తదానం కోసం వెతుకుతున్న నిహారిక గారికి నా స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చేశారు. సదా గారు ప్రార్థన క్యారెక్టర్ లో , రాజేష్ గారు రాఘవ క్యారెక్టర్స్ లలో అద్భుతంగా చేశారు .. ఇందులో నటించిన వారందరూ వారి క్యారెక్టర్స్ కు 100% న్యాయం చేశారు. నేను 2007 నుండి 2020 ఐటీ లో వర్క్ చేసిన నా అనుభవానికి కొంత కల్పితం జోడించి హలో వరల్డ్ స్క్రిప్ట్ రాకున్నాను.ఇది ఒక ఐటి వారికే కాకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ వెబ్ సిరీస్ ను చూసిన వారందరూ కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అని అన్నారు.
రాహుల్‌గా నటించిన నికిల్ వి సింహా మాట్లాడుతూ..నన్ను ఇప్పటివరకు హోస్ట్ గా చూసిన వారు హలో వరల్డ్ లో నన్ను యాక్టర్ గా చూడ్తున్నారు. సదా తో యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీ గా ఉంది.నాకిలాంటి అవకాశం ఇచ్చిన నిహారిక గారికి మరియు ZEE 5 వారికి ధన్యవాదములు.
సీనుమాటోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ.. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో నాకిది రెండవ ప్రాజెక్టు. నాకిలాంటి అవకాశం ఇచ్చిన నిహారిక గారికి మరియు ZEE 5 వారికి ధన్యవాదములు.
మ్యూజిక్ డైరెక్టర్ pk దండి మాట్లాడుతూ..ఇందులో రెగ్యులర్ గా కాకుండా సాంగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. నాకిలాంటి అవకాశం ఇచ్చిన నిహారిక గారికి మరియు ZEE 5 వారికి ధన్యవాదములు.
ప్రవల్లిక గా నటించిన నిత్యా శెట్టి మాట్లాడుతూ.. నేను చాలా మంది దగ్గర పని చేశాను. కానీ ఈ ప్రొడక్షన్ చాలా సేఫ్ అనిపించింది. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సాయి గారు, మరియు డి .ఓ.పి గార్లు నన్ను చాలా బాగా చూయించారు.. సదా గారు, రాజేష్ గార్ల తో నటించడం చాలా సంతోషంగా ఉంది.నాకిలాంటి మంచి వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు శివ సాయి గారికి నిహారిక గారికి మరియు ZEE 5 వారికి ధన్యవాదములు.
వరుణ్ గా నటించిన సుదర్శన్ మాట్లాడుతూ..చెన్నై లో ఉన్న నన్ను పిలిచి వరుణ్ అనే క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు శివ సాయి గారికి నిహారిక గారికి మరియు ZEE 5 వారికి ధన్యవాదములు అన్నారు.
వర్ష పాత్రలో నటించిన అపూర్వరావు మాట్లాడుతూ.. నాకిది ఫస్ట్ ప్రాజెక్ట్. నాకిలాంటి మంచి వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు శివ సాయి గారికి నిహారిక గారికి మరియు ZEE 5 వారికి ధన్యవాదములు.
ఇంకా ఈ కార్యక్రమంలోపాల్గొన్న వారందరూ ఆగస్ట్ 12 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న “హలో వరల్డ్” అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కల్పించిన జీ 5 యాజమాన్యానికి, నిహారిక గారికి దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
తారాగణం:
రాఘవగా ఆర్యన్ రాజేష్
సదా ప్రార్ధనగా
సిద్దార్థ్‌గా రామ్ నితిన్
మేఘనగా నయన్ కరిష్మా
వరుణ్‌గా సుదర్శన్ గోవింద్
ప్రవల్లికగా నిత్యా శెట్టి
రాహుల్‌గా నికిల్ వి సింహా
వర్ష పాత్రలో అపూర్వరావు
సురేష్‌గా గీలా అనిల్
అమృతగా స్నేహల్ ఎస్ కామత్
దేబాశిష్‌గా రవి వర్మ
ఆనంద్‌గా జయప్రకాష్
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శివసాయి వర్ధన్ జలదంకి
నిర్మాత: నిహారిక కొణిదెల
ప్రొడక్షన్ హౌస్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
స్క్రిప్ట్ రైటర్: శివసాయి వర్ధన్ జలదంకి
సినిమాటోగ్రాఫర్: ఎదురురోలు రాజు
సంగీత దర్శకుడు: PK ధండి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్: ఆంషి గుప్తా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్