నేడు కురిసిన వర్షంతో అందరికీ బెంబెలే
బీజేపీ ఆలేరు పట్టణ ప్రధానకార్యదర్శి బందెల సుభాష్ విమర్శ
నేను రాను బిడ్డో.. ఆలేరు పట్టణానికి అంటున్నారు జనం .. నిజమే మరి. వారి మాటల్లో ఎంతో నిజముంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం మున్సిపాలిటీలో డ్రైనేజిలు (మురుగు కాలువలు) అస్తవ్యస్థంగా ఉన్నాయి. ఎంత దీనంగా అంటే చెప్పలేమని, నేడు కురిసిన వర్షంతో అందరికీ ఇట్టే అర్ధం అవుతుందని బీజేపీ ఆలేరు పట్టణ ప్రధానకార్యదర్శి బందెల సుభాష్ అన్నారు. నేడు కురిసిన వర్షంతో అయినా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మరి మన పాలకులేమో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి డ్రైనేజిలు నిర్మిస్తున్నామని చెబుతున్నారు. వారి మాటల్లో వాస్తవం ఎంత? అన్నది ప్రజలే గమనించాలి అన్నారు. ఆలేరు పట్టణం మున్సిపాలిటీలో ఎన్ని వార్డులలో, ఏ ఏ కాలనీలలో ఎన్ని కిలోమీటర్ల మేర డ్రైనేజిలు నిర్మించారు? వాటికీ ఖర్చు ఎంత?, మీరు పట్టణం లో అభివృద్ధి చేస్తున్నామని కొట్టుకుంటున్న డబ్బ, నిజమైతే నేను చూపించిన వార్డులలో కాలనీలో, పట్టణ ప్రజలందరి దగ్గరకు ఒక్కసారి వెళ్లి పరిస్థితులపై ఆరా తీయాలి. ఆఖరుగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎగువనుండి, మరియు పట్టణం లో దాదాపు సగం నీరు రత్నాలవాగు సిల్క్నుం నగర్డి నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుండి పారుతుంది ఈ వాగుపై ఉన్న లోలెవెల్ వంతెనపైనుండి , ఆలేరు పట్టణం నుండి, మున్సిపాలిటీలో భాగమైన బహదూర్పేట, మంతపురి, ఆపై ఉన్న గ్రామాలు మండలాల, ప్రజలు పక్కనే ఉన్న జాతీయ రహదారి వాహనదారులు,అటు కొలనుపాక లో ఉన్న మొత్తం ఎనిమిది నిజాం కాలం నాటి లోలెవెల్ వంతెనలు దాటి ఈ రోడ్డును ఆశ్రయిస్తుండడం తో రద్దిగా మారింది,గత సంవత్సరo మంతపురి దిలావర్పూర్ మధ్య వంతెన కొట్టుకుపోయి ప్రజలు నానా అవస్థలు పడ్డారు, అయినా ఇట్టి సమస్యలపై, స్థానిక ఎమ్మెల్యే, గారికి కానీ, అసలు ఎంపీ గారికి పట్టింపే లేదు, భువనగిరి పార్లమెంట్ సభ్యుడైతే అసలు కంటికే కనబడడం లేదు,కోసమేరుపు ఏమిటంటే ఆలేరు మున్సిపాలిటీ లో భాగమైన బహదూర్పేట లో అధికార పార్టీ ఆరో వార్డు కౌన్సిలర్, మరియు ఆలేరు మున్సిపల్ చైర్మన్ ఆ ఊరి వారు కావడం వారు ఈ సమస్యలపై మిన్నకుండడం సిగ్గుచేటు ఇంత దుర్భర పరిస్థితులను పాలకులకు ఈ దృశ్యాలు చూసైనా కనువిప్పు కలగాలి అని ఆ భగవంతుని వేడుకుంటున్నాను అని బందెల సుభాష్ అన్నారు.