ఆలేరు : అర్హులైన బీడీ కార్మికులకు అందని పెన్షన్ అనర్హులకే అందుతుంది. అర్హులు అయిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నాయకులు, బీర్ల ఫౌండేషన్ యువజన నాయకుడు ఊట్కూరి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ … ఆలేరులో నిరుపేద అర్హులైన బీడీ కార్మికులను ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. బీడీలు చేసి కుటుంబాలను పోషిస్తున్న నిరుపేద ఆడపడుచులకు అర్హులైన వారి లో కొందరికి పెన్షన్ అందడం లేదు. 2017 నుండి PF కట్ అయి ఉన్న వారికి ఏమో పెన్షన్ రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ లబ్ధిదారులకు రాక దాదాపు 5 ఏండ్లనుండి నష్టపోతున్నారని, ఎందుకు ఈ బీడీ కార్మికులకు పట్ల ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని అయన ప్రశ్నించారు. ఇక్కడ 2014 వరకే ఉన్నవారికి మాత్రమే పెన్షన్ వస్తుందని అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ విషయం గురించి ఆలేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నందు అఖిలపక్షం ఆధ్వర్యంలో 2016 లో ధర్నా చేయడం జరిగిందని, లబ్ధిదారులయిన బీడీ కార్మికుల కొరకు ఆ ధర్నా లో బీడీ కార్మికుల యాజమాన్యాలతో అఖిలపక్ష కమిటీ నిర్ణయించిన
కొందరి అర్హులైన బీడీ కార్మికుల యొక్క PF 2017 జనవరి ఫస్ట్ నుంచి PF కట్ అవుతూ జరిగుతుంది కానీ వారికిమో పెన్షన్ రావడం లేదు ఎప్పటి నుండి అయితే PF కట్ అవుతుందో అప్పటి నుండి బీడీ కార్మిక లబ్ధిదారులుఅయిన అందరకూ పెండింగ్లో ఉన్న పెన్షన్ అందరికి రావాలి. ఇక్కడ అన్యాయం అవుతున్న బీడీ కార్మికులకు ఇప్పుడు 2017 నుండి PF ఏమో కట్ అవుతున్నది. మరి వాళ్లకు ఏమో పెన్షన్ వస్తలేదు. 2013 నాటికె PF కట్ అయి ఉన్న వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది అని ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు ఈ ఆలేరు నియోజకవర్గంలో 2013 లో PF ఉన్న వాళ్లు చాలా తక్కువ. బీడీ కార్మికుల సంఖ్య ఇప్పుడు పెరగడం జరిగింది. 2017 నుండి 2022 నేటికి PF కట్టింగ్ అయి లబ్ది చేకూరలేని బీడీ కార్మికులు వేల మంది ఉన్నారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ పెన్షన్ వచ్చే విధంగా వారికి తోడ్పాటును అందించాలని ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి 2017 నుండి 2022 వరకు PF కట్ అయ్యి పెన్షన్ పొందుతలేని అర్హులైన వారికి పెన్షన్ ఇప్పించగలరని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి గారిని మేము కోరుచున్నామని ఊట్కూరి సురేష్ గౌడ్ తెలిపారు.