అర్జున్ రెడ్డి బ్యూటీ అంతపని చేసిందా?

arjunreddy beayty shalinipandeyantha pani chesindha?
Spread the love

ర్జున్ రెడ్డి బ్యూటీ అంతపని చేసిందా!?.. టాలీవుడ్ లో ఎవ్వరినోటా విన్నా తాజాగా ఇదే మాట! తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న షాలిని పాండేకు ఆ విజయం కలిసి రాలేదు. ఎంతో ఆశగా అవకాశాల కోసం ఎదురుచూసినా, తెలుగులో ఈమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్ వైపు తొంగి చూశింది. అటు వైపునకు వెంటనే అడుగులు వేసింది. అనూహ్యంగా అక్కడ ఈ అమ్మడు యశ్ రాజ్ ఫిలింలో ఒక్కసారే మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుండగా మూడులో మరో ప్రాజెక్ట్ గా జునైద్ ఖాన్ తో సినిమా చేయబోతుంది. ఈమెకు ఈ మూడు ప్రాజెక్ట్ లతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్ బ్యానర్ లో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ముద్దుగుమ్మ షాలిని పాండేను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల నుండి సమాచారం. ఇప్పటికే జునైద్ ఖాన్ మరియు షాలిని పాండేలపై ఫొటో షూట్ కూడా చేయడం.. టెస్ట్ షూట్ కూడా నిర్వహించడం జరిగిందట. వచ్చిన ఔట్ పుట్ తో సంతృప్తి చెందిన మేకర్సు ఇద్దరి కాంబోలో సినిమాకు సిద్దం అయ్యారట. అయితే జునైద్ ఖాన్ మరియు షాలిని పాండేలపై ఫొటో షూట్ చేస్తున్న సమయంలో ఓ రోజు రాత్రి విచిత్ర సంఘటన జరిగిందట. ఆ సంఘటనలో షాలిని పాండేతో పాటు వచ్చిన ఓ వ్యక్తి ఆమె హోటల్ గదిలోకి వెళ్లి నానా రభస చేశాడట! దాంతో చిర్రెత్తుకొచ్చిన షాలిని పాండే అతడిపై చేయి చేసుకుందట. ఇంతకీ ఆ హోటల్ గదిలోకి వచ్చింది ఎవరు? షాలిని పాండేకు అతడికి ఏమిటీ సంబంధం? అని సొషల్ మీడియాలో పోస్టులు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Related posts

Leave a Comment