అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ ‘రచ్చబండ’లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ

అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ 'రచ్చబండ'లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు
Spread the love

ఉపాధి లేక, చదువుకున్న చదువుకు ఉద్యోగాల్లేక కూలీలుగా మారిన యువతను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడాలి. ఇలాంటి పాలకులను మనము గెలిపించినందుకు మన తప్పును మనమే సరిదిద్దుకోవాలి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రం వచ్చిన తర్వాత 8500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ రైతు కుటుంబాలను కూడా అక్కున చేర్చుకో లేనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు పిసిసి అధ్యక్షులు రేవంతన్న అన్నట్టుగా నేటి నుంచి ఏ రైతు కూడా బ్యాంకులో తీసుకున్న అప్పు డబ్బులు కట్ట వద్దు. 12 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టడం ధరణి పోర్టల్ రద్దు చేస్తూ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తూ రైతులకు మేలు జరిగే విధానాలను తీసుకొచ్చేది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్ప చెప్తే 5 లక్షల కోట్ల అప్పులతో అప్పుల తెలంగాణ గా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు వారితో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు 15,000 అందించేది, నకిలీ విత్తనాలు పురుగుల మందులు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు రైతులను అన్ని రకాల ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ నే అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడిపాటి నరసయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, పావని, యాదగిరి, జ్యోతి, దుర్గ, సవిత, మంజుల, సౌజన్యతో పారు అనేక మంది మహిళా సోదరీమణులు, మండల పార్టీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ, ఎస్సీ సెల్ బీసీ సెల్ తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు,

Related posts

Leave a Comment