ధనుష్, ఐశ్వర్యలు విడిపోయిన తర్వాత కూడా మళ్లీ కలిశారా? కలిసే ఉంటున్నారా? అవును.. ఇది నిజమే అంటున్నారు కోలీవుడ్ జనాలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఒకేచోట కనిపించారట. అదేంటి? వాళ్లిద్దరూ విడిపోయారు కదా! మరి ఒకేదగ్గర ఉండటం ఏంటి? అనుకుంటున్నారా? అదే కదా మీ డౌటు? మరేం లేదు.. వ్యక్తిగత విషయాలతో డిస్టర్బ్ అయిన ఈ ఇద్దరూ అప్పుడే తమతమ పనుల్లో మునిగిపోయారు. ధనుష్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉండగా, అటు ఐశ్వర్య కూడా లవ్ సాంగ్ చిత్రీకరణ కోసం సిటీలో పాగా వేసింది. అయితే వీళ్లిద్దరు కూడా ఒకే హోటల్లో ఉంటున్నట్లు సమాచారం. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిటీకి వచ్చేసిన వీళ్లిద్దరూ రామోజీ రావు స్టూడియోలోని సితార హోటల్లో బస చేసినట్టు సమాచారం. ఐశ్వర్య ప్రస్తుతం ఓ లవ్ సాంగ్‌ను డైరెక్ట్ చేస్తోంది. ఈ పాటను వాలంటైన్స్ డేకి విడుదల చేయాలని భావిస్తున్నారు. కాగా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 18 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉంటూ వచ్చిన ఈ దంపతులు 2022 జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే!
అదేంటి? ధనుష్, ఐశ్వర్యలు మళ్లీ కలిశారా?
