టాలీవుడ్ టైమ్స్ # ఆలేరు
‘అగ్నిపథ్’ దేశాన్ని అగ్నిగుండం లా మార్చింది : ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు ఆలేరు పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య గారు.. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండల,టౌన్ పార్టీ ల అధ్యక్షులు,ఎంపీపీలు,సర్పంఫులు గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చకు ముందే ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం సరికాదని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య మండిపడ్డారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్మీ విద్యార్థులకు పోలీసులను పంపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనలో ఆర్మీ విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అగ్ని పాత్ పథకం అనేది దేశంలో అగ్నిగుండం లాగా మరిస్తుందని అన్నారు. ఆర్మీ విద్యార్థులు శారీరకంగా అనేక రకాల శిక్షణ పొందిన రాతపరీక్షలు వచ్చేవరకు ఇలాంటి పథకాలు పెట్టడం ద్వారా యువత నిరుద్యోగులకు మారాల్సి వస్తుందని అన్నారు.అగ్ని పథకం అనేది నాలుగు సంవత్సరాలు పెట్టడం ఆశ్చర్యకరమైన పతకం అన్నరు.దేశ వ్యాప్తంగా 18 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న 25 కోట్లు మంది యువకులు ప్రధానిగా మోడీ నీ ఎన్నుకున్నారు.
రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మిన వ్యక్తిని ఇదే యువకులు ప్రధానిని చేశారు.అలాంటి యువకుల పట్ల ఇదేనా మీ చిత్తశుద్ది.అలాంటి యువత గురించి నిర్ణయం తీసుకునే ముందు చట్ట సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది.అగ్నిపత్ స్కీమ్ దేశ భద్రతను ప్రమాదంలో నెట్టింది.
ఈ హడావిడి నిర్ణయం వల్ల కోట్లాది మంది యువకులు దేశానికి భద్రత లేదని భావించి ఆందోళన బాట పట్టారు.అగ్నిప్రత్ పథకంలో నాలుగు సంవ్సరాలు పని చేసి
ఇంటికి వెళ్తే కనీసం మాజీ సైనికుడు హోదా కూడా దక్కక పోవడం దారుణమని.ఈ స్కీమ్ వల్ల యువకులు అడ్డా మీద కూలిల్ల పని చేసి ఇంటికి వెళ్లవలసిందే.ఈ స్కీమ్ లో సైనికుడిగా పని వచ్చిన యువకుడికి కనీస పెన్షన్ అవకాశం ఉండదు.ఇలాంటి చర్యలు వల్ల నైపుణ్యం లేని యువకులు యుద్ధం లో పాల్గొంటే ఒడి పోయే అవకాశం ఉంటుందన్నారు.గతంలో రెండు సంవత్సరాల కటిన శిక్షణ ఉండేదని.ఈ శిక్షణ వల్ల సైనికులు మానసికంగా సిద్ధం అయ్యేవారు.ఇపుడు అరు నెలలో కాలంలో యువత ఏం ట్రైనింగ్ తీసుకుంటుందని.జీవితంలో అడుగు పెట్టక ముందే ఈ స్కీం వల్ల యువత భవిష్యత్ ముగుస్తుందని అన్నారు.