నన్ను బికినీలో చూడటానికి నా అభిమానులు ఇష్టపడరని అంటోంది తాప్సీ. ప్రతిఒక్కరికీ వారి ఎంపికలు ఉంటాయి. బికినీ ధరించాలా వద్దా అనేది వారి వారి ఇష్టం. బికినీ నాకు సౌకర్యంగా అనిపించదు. ఎందుకంటే నా అభిమానులకు నేను అలా కనిపించడం నచ్చదు అని చెప్పింది. ప్రారంభ చిత్రాల్లో తాప్సీ బికినీ ధరించినప్పుడు తనకు ఎదురైన అనుభవాల రీత్యా తాను కూడా అసౌకర్యం ఫీలవుతోందని అర్థమవుతోంది. అన్నట్టు పింక్ – నామ్ షబానా అంటూ తన ఇమేజ్ ని తానే మార్చేసుకుంది. గ్లామర్ నాయికగా కంటే రెబల్ యాటిట్యూడ్ ఉన్న యాక్షన్ నాయికగానే తాను పాపులరైంది. ఇప్పుడు బికినీ వేసినా ఎవరూ పట్టించుకోరు. తనకంటూ అర్థవంతమైన కాన్సెప్టులతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు తాప్సీ నటిస్తున్నవి కూడా అలానే ఉన్నాయి. రష్మి రాకెట్-హసీనా దిల్ రుబా ఇవన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్నవే. బలమై స్త్రీవాదం వ్యక్తిత్వం ఎలివేట్ చేసే నటనతో తాప్సీ అందరినీ ఆశ్చర్యపరుస్తుందిట. పింక్ – తప్పాడ్ లాంటి కల్ట్ సినిమాల్లో నటించి కల్ట్ నాయికగా పాపులరైంది కాబట్టి ఇప్పుడు అనవసరంగా బికినీలతో గ్లామర్ ని ఎలివేట్ చేయాలన్న ప్రయత్నం కూడా సరికాదు. తనకంటూ ఓ సపరేట్ రూట్ ఉందని నిరూపించుకునే క్రమంలో తాప్సీ కొన్నిటిని వదులుకోవాల్సి వస్తోంది. అందుకే తాప్సిని అందరూ గ్రేట్ అని అంటుంటారు.
అందుకే తాప్సీ వాటిని వదులుకోవాల్సి వచ్చింది?!
