అందరి ఆశీస్సులు ఉన్నాయి.. సినిమాను ఎవరు ఆపుతారో చూస్తా? : బాయ్ కాట్ ‘లైగర్’ కు గట్టి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

liger in vijay devearakonda
Spread the love

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లైగర్ ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో గాయంతో బ్యాక్ పెయిన్ ఉన్నా…సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సినిమా కోసం ఇంత కష్ట పడ్డాం..ఇప్పుడు రిలాక్స్ అయితే ఎలా అని ఇటీవల హైదరాబాద్ ప్రెస్ మీట్ లో విజయ్ చెప్పడం సినిమా మీద ప్యాషన్, ప్రమోషన్స్ మీద ఆయనకున్న కమిట్ మెంట్ చూపిస్తోంది. ఇక ఎక్కడికి వెళ్లినా ఆయన క్రేజ్ కనిపిస్తోంది. చాలా చోట్ల క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ అవుతున్నాయి.
సినిమా రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్న కొద్దీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ లో మిగతా అందరు స్టార్స్ సినిమాల్లాగే బాయ్ కాట్ లైగర్ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. బాయ్ కాట్ లైగర్ పై ఇవాళ ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో మరోసారి గట్టిగా స్పందించారు విజయ్ దేవరకొండ . ఆయన మాట్లాడుతూ…నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది, ప్రజల ప్రేమాభిమానాలు ఉన్నాయి, దేవుడి కృప ఉంది. గెలవాలనే ఫైర్ లోపల ఉంది. ఇక మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాను. అంటూ బలమైన కౌంటర్ ఇచ్చారు.
బెంగళూరులో విజయ్ దేవరకొండ క్రేజ్, వరదలా వచ్చిన అభిమానులు, ముంబై, పాట్నా క్రౌడ్ రిపీట్
రాష్ట్రాలు ఎన్నైనా సినిమాను ప్రేమించడంలో, స్టార్స్ ను అభిమానించడంలో మనమంతా ఒక్కటే అని నిరూపిస్తోంది విజయ్ దేవరకొండ క్రేజ్. ఆయన కొత్త సినిమా లైగర్ ప్రమోషన్ లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఏ ప్రాంతంవెళ్లినా అక్కడి వేదికలు, మాల్స్ వరదలా వచ్చే ప్రజలతో నిండిపోతున్నాయి. ముంబై, పాట్నా, కొచ్చి, విజయవాడ ..ఇప్పుడు బెంగళూరులో అదే క్రేజ్ కనిపించింది.
తాజాగా లైగర్ టీమ్ తో బెంగళూరు వెళ్లారు విజయ్ దేవరకొండ. అక్కడ పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించి అనంతరం ఈవెంట్ లో పాల్గొన్నారు. ఎయిర్ పోర్టు నుంచే అభిమానుల సందడి మొదలైంది. విజయ్ ను ఫాలో చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, ఆయన దగ్గరకు పిలవగానే ఎమోషన్ అవడం ఇవన్నీ బెంగళూరు టూర్ లో కనిపించిన దృశ్యాలు. ఈవెంట్ నిర్వహించిన మల్టీప్లెక్స్ మాల్ మొత్తం నిండిపోయింది. వాళ్లను అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. బెంగళూరు టూర్ తర్వాత విజ.య్ ట్వీట్ చేస్తూ….ఈ నెల అద్భుతంగా గడిచింది. పునీత్ అన్నకు నివాళులు అర్పించడం, బెంగళూరు అభిమానులను కలుసుకోవడం ఉద్వేగంగా ఉంది. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా. అని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment