”టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అన్నారు నేచురల్ స్టార్ నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రొమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రోజు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘అంటే సుందరానికి నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. ఈ సినిమా కోసం చాలా మంచి టీమ్ పని చేసింది. చాలా రోజుల తర్వాత అంతా ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి పని చేస్తున్నామనే ప్లజంట్ ఫీలింగ్ కలిగింది. ఇది మీకు తెరపై కనిపిస్తుంది. సినిమా గురించి చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. టీజర్ లాంచ్ కాబట్టి అప్పుడే సినిమా గురించి ఎక్కువ చెప్పను. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి మాత్రం ఒక మాట చెప్పాలి. కొన్ని సినిమాలు, కథలు మరో దర్శకుడు తీస్తే ఎలా వుంటుంది ? అని ఊహించుకునే అవకాశం వుంటుంది. కానీ వివేక్ తీసిన సినిమా మాత్రం వివేక్ తప్పా ఎవరూ తీయలేరు. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నాలో వుండే ప్రేక్షకుడు వివేక్ చేసే సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాడు. నజ్రియా తెలుగులో నటిస్తే బావుటుందని చాలా కాలంగా చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎవరి ఫోన్లు ఎత్తలేదు. మా రిక్వెస్ట్ ఒప్పుకున్నందుకు, మా సినిమాలో నటించినందుకు నజ్రియాకి చాలా థ్యాంక్స్. టీజర్ అదిరిపోయింది. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అన్నారు నాని.
దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్, నాని గారు, నజ్రియా ఇది డ్రీం కాంబినేషన్. నాని, నజ్రియా నటన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. మీరంతా చూస్తారు. నా టీమ్ అందరికీ థ్యాంక్స్. స్క్రిప్ట్ రాసినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. రాసింది రాసినట్లు వస్తే బావుండని అనుకున్నాను. కానీ నా టీమ్ నేను రాసింది, ఊహించినదాని కంటే పదిరెట్లు అద్భుతంగా చేశారు. సినిమాటోగ్రఫర్ నికిత్, సంగీత దర్శకుడు వివేక్, ఎడిటర్ రవితేజ, లతా, వరుణ్, పల్లవి.. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. డైరెక్షన్ టీం ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియకుండా ఈ సినిమా కోసం పని చేశారు. సచ్విన్, దినేష్, రాధ గారు,అనిల్, విద్య, కీర్తి, విక్కీ, విజయ్ .. అందరికీ థ్యాంక్స్. చివరిగా నజిరియా.. వెల్కమ్ టు తెలుగు సినిమా” అని అన్నారు వివేక్.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ… ఈ సినిమా మాకు చాలా చాలా స్పెషల్. స్క్రిప్ట్ చదివినప్పుడే హిట్ అనుకునే సినిమాలు కొన్ని వుంటాయి. అందులో అంటే సుందరానికి కూడా వుంది. ఈ స్క్రిప్ట్ వినగానే సూపర్ డూపర్ హిట్ అనుకున్నాం. ఈ సినిమాకి పనిచేసిన టెక్నిషియన్లు అంతగొప్ప సింక్ తో పాజిటివ్ ఎనర్జీతో వర్క్ చేశారు. షూట్ చేస్తున్నపుడే సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఫైనల్ అవుట్ చూశాక ఆ నమ్మకం ఇంకా పెరిగింది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నిషియన్స్ అందరికీ థ్యాంక్స్. మా హీరో నాని గారికి వెరీవెరీ స్పెషల్ థ్యాంక్స్. హీరోయిన్ నజ్రియా గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఫాహాద్ గారితో పని చేసినప్పుడు ఎంత కంఫర్ట్ గా చేశామో అంతకు రెండు రెట్లు నజ్రియా గారితో చేశాం. మైత్రీ మూవీ మేకర్స్ విజయంలో హీరోలు, దర్శకులు, టెక్నిషియన్లకు చాలా ముఖ్యమైన స్థానం వుంది. ఇందులో మా హీరో నాని గారి కూడా వున్నారు. అలాగే ఈ సినిమాతో మైత్రి మూవీ సక్సెస్ లో నాని సింహభాగం అవుతారని బలంగా
నమ్ముతున్నాము. జూన్ 10 ‘అంటే.. సుందరానికి’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాం. అలాగే మే 12 ‘సర్కారు వారి పాట’ తో వస్తున్నాం. ఇది చాలా పెద్ద హిట్ కొట్టాక అంతే లెవల్ లో మా నాని గారి సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం.” అన్నారు
హీరోయిన్ నజ్రియా మాట్లాడుతూ.. ఇదే నా మొదటి సినిమా అనే భావన కలుగుతుంది. బహుసా భాష వలన కావచ్చు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. నా మొదటి తెలుగు సినిమాకి ఇంత మంచి టీమ్ తో కలసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు
సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి మాట్లాడుతూ: ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు చాలా ఫన్ ని ఎంజాయ్ చేశాం. ఆ ఫన్ తెరపై కూడా కనిపిస్తుంది. జూన్ 10న థియేటర్ లో కలుద్దాం” అన్నారు.
ఎడిటర్ రవితేజ మాట్లాడుతూ..: టీజర్ లో ఎంత ఫన్ వుంటుందో అంతకంటే ఎక్కువ ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి మించిన ఫన్ సినిమాలో వుంటుంది. యూనిట్ అంతా కలసి ఒక సూపర్ ఫన్ సినిమా చేశాం. జూన్ 10 సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అన్నారు
ప్రొడక్షన్ డిజైనర్ లతా మాట్లాడుతూ.. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయకి, నిర్మాతలకి కృతజ్ఞతలు. మీ అందరితో కలసి సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను” అన్నారు.
ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు పాల్గొన్నారు.