పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా ఇది.అయితే ఈ చిత్రం నుంచి నిధి అగర్వాల్ తీసేసి ఈ బ్యూటీ స్థానంలో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను తీసుకున్నట్టు తెలిసింది. నిధి అగర్వాల్ హావభావాలు నచ్చక ఆమెను చిత్రం నుంచి తొలగించినట్టు సమాచారం. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటించాల్సింది. అయితే ఈ పాత్రకు ఆమె ఈ మాత్రం సూట్ అవడంలేదని దర్శకుడు క్రిష్ భావించారట. అందుకే ఈ చిత్రం నుంచి ఆమెను తొలగించి ఆమె చేయాల్సిన ‘పంచమి’ క్యారక్టర్ లో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను ప్రవేశ పెట్టినట్టు తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
మొఘల్ కాలంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు దొంగ పాత్రనే ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొఘల్ రాకుమారి పాత్రలో కనిపించనుందని టాక్.
‘హరి హర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ ఔట్ నర్గీస్ ఫక్రి ఇన్ !
