సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం ప్రారంభం

Superstar Mahesh Babu's much-awaited hattrick collaboration with director Trivikram, produced by Haarika and Hassine Creations, goes on floors
Spread the love

-ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో, శ్రీమతి మమత సమర్పణలోటాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం నేడు (3-02-2022) ప్రారంభం అయింది.
హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటల 53 నిమిషాలకు చిత్రం పూజాకార్యక్రమాలు తో , ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభమయింది.
చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు.
ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు.
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. వీటిని మరింతగా నిజo చేస్తూ ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు`, `ఖ‌లేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ నేడు ప్రారంభమైందన్న న్యూస్ ఇటు ప్రేక్షకుల్లో, అటు అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.
మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్ ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్. రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్పెష‌ల్ క్రేజ్ ఉన్న #SSMB28 చిత్రానికి స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి మ‌మ‌త‌, నిర్మాత‌: సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.

Related posts

Leave a Comment