శిరోమణి డా॥ వంశీ రామరాజు, డా॥ తెన్నేటి సుధ
అతడు మానవతకు ప్రతీక
ప్రశాంతవదనంతో శోభించే ఆయనకు
చిరునవ్వే ఆభరణం
రంగస్థల, జానపద కళాకారుల పాలిట కల్పవృక్షం
వంశీ వేగేశ్న దివ్యాంగుల ఆశ్రమానికి
ఐదు లక్షలు ఇచ్చిన శాశ్వతనిధి దాత
వైద్యశాలకు వచ్చే రోగుల
సంరక్షణకు బాధ్యత వహిస్తున్న స్ఫూర్తిదాత
అజాతశత్రువుగా ఎల్లరకు
ప్రేమను పంచే ఆత్మీయతా సింధువు
మనసంతా సేవాపరాయణత
అంతర్లీనంగా ఆధ్యాత్మికత
ప్రవహించే భక్తి స్రోతస్విని
కార్యదక్షత, నిరంతరకృషితో
ఆదర్శంగా నిలిచిన విశిష్టమూర్తి
అతడు మా కుటుంబానికి
అత్యంత ఆత్మీయుడు
సారిపల్లి కొండలరావు మహోదయుడు
వారి జన్మదినం
మావంటివారందరికీ శుభదినం
81వ జన్మదినం సందర్భంగా
మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు
భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు
ఆయురారోగ్యాలు ప్రసాదించాలని
మీ కుటుంబమంతా
ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ