మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీసులతో సత్య ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1గా ‘మెగా పవర్’ చిత్రం ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రఘుబాబు క్లాప్ ఇచ్చారు. ికిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పృథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. హీరో మాట్లాడుతూ ‘‘హీరోగా తొలి చిత్రమిది. లైన్ బావుంది. కథ మీద బాగా వర్క్ చేశాం. నా మీద నమ్మకంతో మా బాబాయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ టీమ్ చేస్తున్నాం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తాం. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు. హీరోయిన్ శశి మాట్లాడుతూ ‘‘తెలుగులో తొలి చిత్రమిది. హీరోయిన్ పరిచయానికి చక్కని కథ ఇది. రవిచంద్ర మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారి ఆశీస్సులతో సత్య ఆర్ట్స్ పతాకంపై తొలి చిత్రం ప్రారంభమైంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. యాక్షన్ సీన్స్ కోసం తగిన జాగ్రత్తలతో హీరో శిక్షణ పొందారు. త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తాం. అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు’’ అని అన్నారు. పృథ్వీ, రఘుబాబు, మురళీశర్మ, రచ్చ రవి, రియాజ్, రెహమాన్, శ్రీకాంత్ అయ్యంగర్, సురేష్, సంగీత, ప్రభావతి వర్మ, కౌశల్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి…డిఓపి: శ్రీకాంత్ గేదెల, కొరియోగ్రాఫర్ఫ శిరీష్ గేదెల, ఆర్ట్: విఠల్ కోసనం, సంగీతం: మ్యాడీ, ఎడిటర్: మార్తండ్ కె. వెంకటేశ్, స్టంట్ మాస్టర్: టి. రవిరాజు, స్టిల్ ఫొటోగ్రాఫర్: కృష్ణ, మాటలు: రావణ్ తోట, నిర్మాతలు: అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల, కథ – స్ర్కీన్‌ప్లే – దర్శకత్వం: రవిచంద్ర గేదెల
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...