తెలుగు సినిమా హిస్టరీలో సంతోషం
ఒక చెరగని ముద్ర. సంతోషం మ్యాగజైన్ .. సంతోషం అవార్డ్స్ కు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పని లేదు. గత 20 ఏళ్లుగా సంతోషం మేగజైన్ ఎడిటర్ గా పబ్లిషర్ గా నిరంతర సినీసమాచారాన్ని రీడర్ కి అందిస్తూ అజేయంగా పత్రికను నడుపుతున్నారు. నిర్మాతగా పంపిణీదారుగానూ ఆయన తనదైన ముద్ర వేశారు. నేటి డిజిటల్ ట్రెండ్ కి తగ్గట్టుగా యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించి దిగ్విజయంగా 500 ఎపిసోడ్స్ ని రన్ చేయడం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లో సంతోషం ఫిల్మ్ న్యూస్
500 ఎపిసోడ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్లో ఇంత కాంపిటీషన్ నడుమ ఇదెలా సాధ్యమైంది? అంటే దానికి కారణం.. నేటి జనరేషన్ కి నచ్చే విధంగా యూట్యూబ్ కంటెంట్ ని మలిచి శరవేగంగా సబ్ స్క్రైబర్లను సంపాదించడమే. పరిశ్రమ తాజా డెవలప్ మెంట్స్ అప్ డేట్స్ ని ఎనాలిసిస్ లను నిరంతరం అందిస్తూ సంతోషం ఫిల్మ్ న్యూస్ వైరల్ గా మారింది. మాధ్యమం ఏదైనా పట్టువదలని విక్రమార్కుడిలా ఎదురేలేని విధంగా సత్తా చాటుతామని సంతోషం సురేష్ మరోసారి నిరూపించారు. కేవలం రెండు కరోనా లాక్ డౌన్ల వ్యవధిలోనే యూట్యూబ్ చానెల్ ని ఇంతగా పాపులర్ చేసిన మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. మునుముందు 5000 ఎపిసోడ్లు ఇంతకంటే వేగంగా పూర్తి చేసుకుని సత్తా చాటేందుకు షెడ్యూల్ ని ప్రిపేర్ చేశారు.
సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లో సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్ సంచలనం
