వైవిధ్యమైన కథతో వై.ఆర్.చౌదరి కొత్త చిత్రం!

వైవిధ్యమైన కథతో వై.ఆర్.చౌదరి కొత్త చిత్రం!
Spread the love

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ఓ యువకుడు ఏ విధంగా పోరాటం చేశాడు? ఆ పోరాట ఫలితంగా ఎలాంటి విజయాన్ని సాధించాడు? అనే ఆసక్తికరమైన కథ, కథనంతో సూపర్ గుడ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు వై. ఆర్. చౌదరి దర్శకత్వంలో గురుప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రకరణ కూడా పూర్తి చేసుకుంది. సిద్దార్థ్, తేజస్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు నర్సాపూర్ అడవి, కామారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్టు దర్శకుడు వై.ఆర్.చౌదరి ‘టాలీవుడ్ టైమ్స్’కు తెలిపారు. మిగతా షూటింగ్ కర్నూల్, కడప, రాజమండ్రి, యానాం, అరకు, గోవా, కాకినాడ, విశాఖ పట్టణం, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. సుమన్, ఆర్. చలపతి రాజు, సిద్దరాములు, సౌమ్య, అప్పల నాయుడు, అరుణ్, భాను ప్రకాష్, అక్షర, సైదులు, జితన్ బాబు, అక్షయ, గోపీచంద్, లోకేష్, నాగూర్ బాబు, డాక్టర్ రుక్మాంగదర్,విజయ్ కుమార్, అర్జున్, సవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, బోధ త్రినాథ్, కోడిప్యాక సాయి రామ్, బాజా లలిత, భోగ శ్రీనివాస్, గందె నాగరాజు, డాక్టర్ హరీష్ గౌడ్, ఎల్. వినయ్, కోడం శిరీష, బెల్దే విశ్వం గుప్తా, సతీష్ కుమార్, బాల లింగం, గోల్డ్ రెడ్డి, ప్రసాద్ త్రివేణి, రాజ్ కుమార్, బచ్చారం మాధురి, మహంతి, గీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో-డైరెక్టర్ : మీసాల రామకృష్ణ, ఫైట్ మాస్టర్ : ఆర్. కె., సినిమాటోగ్రఫీ : నందు ప్రసాద్, పాటలు : వెంకట్ అడ్డాల, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వై. ఆర్. చౌదరి.

Related posts

Leave a Comment